Bigg Boss 6 Telugu Day 65 Promo: గత వారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ ఎంత కాక రేపిందో తెలిసిందే.. ఇంటి సభ్యులందరూ చెలరేగిపోయి ఆటని ఆడారు.. ఇక ఈ వారం కూడా ఇంటి సభ్యులకు కెప్టెన్సీ టాస్కు ఆడే సమయం వచ్చేసింది..ఇందులో భాగంగా ‘స్నేక్ vs ల్యాడర్’ ఆటని బిగ్ బాస్ నిర్వహించాడు.. ఈ ఆటలో ఇంటి సభ్యులు రెండు గ్రూప్స్ గా విడిపోయి కొంతమంది ల్యాడర్ ని నిర్మించాలి.. మరికొంత మంది స్నేక్ ని నిర్మించాలి..ఈ టాస్కు కి సంబంధించిన ప్రోమోని కాసేపటి క్రితమే విడుదల చేసారు.

ఈ ప్రోమో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..ఈ ప్రోమో లో ఉన్న ఇంటి సభ్యులందరిలో కీర్తి బాగా హైలైట్ అయ్యింది..గత వారం కెప్టెన్సీ టాస్కు ని ఆడుతూ తన చేతి వేలుని ఆమె విరగ్గొట్టుకున్న సంగతి మన అందరికి తెలిసిందే.. విరిగిన వేలుతోనే ఆమె ఈరోజు టాస్కు రెచ్చిపోయి మరీ ఆడింది.. అందువల్ల నొప్పి మరింతగా పెరిగిపోయింది.
‘చెయ్యి నొప్పేస్తున్నందుకు కూడా నాకు బాధలేదు..కానీ ఇది నా ఆటకి అడ్డు వస్తుందని బాధేస్తుంది’ అంటూ ప్రోమో చివర్లో ఆమె ఏడవడంతో ఇది సభ్యులందరూ ఆమెని ఓదారుస్తున్నారు.. కానీ అంతకుముందు ఆమె ఈ టాస్కులో ఏకంగా మగవాళ్ళతో పోటీ పడింది.. ఫిజికల్ గా శ్రీ సత్య తో తలపడి ఆమెని ఓడించేస్తుంది కూడా.. వేలు విరిగినప్పటికీ కూడా టాస్కుని ఇంత కసిగా ఆడిన కీర్తికి సోషల్ మీడియా లో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది..మొదటి నుండి ఫిజికల్ టాస్కులలో కీర్తి మగవాళ్ళతో కూడా పోటీ పడీమరీ ఆడుతూ వస్తుంది.. ఎన్నోసార్లు ఆమె మగవాళ్ళని ఓడించేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

టాస్కులో ఎలా అయినా ఆడాలనే తపన ఆమె ప్రతి ఆటలో మనం గమనించొచ్చు..గత వారం ఆమె వేలు విరగొట్టుకున్న తర్వాత కూడా ఖాళీగా మూలన కూర్చోలేదు..దెయ్యంగా మారి ‘బ్లూ స్క్వాడ్’ టీం వారిని ‘రెడ్ స్క్వాడ్’ టీం వైపు రాకుండా కట్టడి చెయ్యడానికి ప్రయత్నం చేసింది..ఇలా బిగ్ బాస్ గేమ్ ఇచ్చినప్పుడల్లా నూటికి నూరు శాతం తన ఎఫ్ర్ట్స్ ని సంపూర్ణంగా పెడుతూ కీర్తి తన గ్రాఫ్ ని పెంచుకుంటుంది.
