Homeఅంతర్జాతీయంIran War Impact On China Weapons Reputation: ఇరాన్‌ యుద్ధం.. ఇజ్జత్‌ తీసుకున్న చైనా.....

Iran War Impact On China Weapons Reputation: ఇరాన్‌ యుద్ధం.. ఇజ్జత్‌ తీసుకున్న చైనా.. తలెత్తుకోలేని పరిస్థితిలో డ్రాగన్‌!

Iran War Impact On China Weapons Reputation: యుద్ధం జరుగుతున్నది గల్ప్‌లో, యుద్ధం జరుగుతున్నది పశ్చిమాసియాలో, యుద్ధ జరుగుతున్నది ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ మధ్య. వైమానిక దాడులు జరుగుతున్నది కూడా అక్కడే. ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ పనిచేస్తున్నది కూడా అక్కడే కానీ చైనా ఎక్కి ఎక్కి ఏడుస్తోంది. ఈ యుద్ధం కారణంగా అన్నింటికన్నా ఎక్కువగా పరువు పోగొట్టుకుంది. ఇరాన్‌కు చైనా సరఫరా చేసిన హెచ్‌క్యూ–9బీ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఈ సంఘటన చైనా ఆయుధాల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Also Read: రాష్ట్ర రాజకీయాల్లో ముగిసిన నితీశ్‌ శకం.. బీజేపీ ఖాలాలోకి బిహార్‌!

చైనా–ఇరాన్‌ ఒప్పంద..
గతేడాది జూలైలో ‘ఆయిల్‌ ఫర్‌ వెపన్స్‌’ ఒప్పందంలో చైనా ఇరాన్‌కు హెచ్‌క్యూ–9బీ సిస్టమ్‌ సరఫరా చేసింది. ఈ వ్యవస్థ అమెరికాకు చెందిన పేట్రియట్, రష్యాకు చెందిన ఎస్‌–300 కంటే ఉత్తమమని ప్రచారం చేసింది. 260 కిమీ రేంజ్‌ వరకు పనిచేస్తుందని, 100 లక్ష్యాల ట్రాకింగ్‌ సామర్థ్యం ఉందని పేర్కొంది. 50 అడుగుల ఎత్తులోనే శత్రు విమానాలను ధ్వసం చేస్తుందని తెలిపింది. దీంతో ఇరాన్‌ దీనిని తన స్వీయ బాబర్‌–373, ఖోర్దాద్‌–15 వంటి వ్యవస్థలతో ప్రధాన పట్టణాల్లో మోహరించింది.

దాడుల సమయంలో విఫలం..
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో హెచ్‌క్యూ–9బీ ఒక్క మిస్సైల్‌ను కూడా అడ్డుకోలేదు. భారీ నష్టాలకు దారితీసింది. 20 ప్రాంతాల్లో విధ్వంసం జరిగింది., సుప్రీం లీడర్‌ ఖమేనీ మరణానికి కారణమైంది. దీంతో చైనా మాల్‌ ఎలా పనిచేస్తుందో ప్రపంచానికి అర్థమైంది.

పాకిస్తాన్‌లోనూ పనిచేయని వైనం..
2025 మేలో పాకిస్తాన్‌ ’ఆపరేషన్‌ సిందూర్‌’లో భారత దాడులకు హెచ్‌క్యూ–9బీ విఫలమైంది. కిరాణా హిల్స్, నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌లు లక్ష్యాలు. వెనెజువెలాలో అమెరికా దాడుల సమయంలోనూ ఇదే పరిస్థితి. మధురో కుటుంబ కిడ్నాప్‌కు స్పందన లేదు. ఈ సంఘటనలు చైనా సాంకేతికత బలహీనతను బహిర్గతం చేశాయి.

ప్రపంచ ఆయుధ మార్కెట్‌లో చైనా ప్రతిష్ట దెబ్బతినడంతో అమెరికా, రష్యా వంటి ప్రత్యర్థులు లాభపడతారు. ఇరాన్‌తో ఆర్థిక ఒప్పందాలు దెబ్బతింటాయి; చైనా ఆయిల్‌ సరఫరా ఆధారపడి ఉంది. ఈ వైఫల్యం భవిష్యత్‌ ఒప్పందాలకు అడ్డంకిగా మారవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version