Pawan Kalyan Tweet: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రతీకారాలతో తగలబడిపోతున్నాయి.. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అనే సందేహం కలుగుతుంది.. ముఖ్యంగా అధికార వైసీపీ సృష్టిస్తున్న విద్వేషాలు, నిరంకుశ పాలన ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నిన్న గాక మొన్న ఇప్పటం గ్రామంలో ఇళ్ళని కూల్చివేసి విధ్వంసం సృష్టించిన ప్రభుత్వం..ఇప్పుడు మరో దారుణానికి ఒడిగట్టింది.

జనసేన పార్టీ నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన ఒక వ్యక్తిని వైసీపీకి చెందిన వారు చంపేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడి తల్లి స్వయంగా ఈ ఆరోపణలు చేశారు.. నెల్లూరు జిల్లా కావాలి పట్టణంలోని తుమ్మలకుంట అనే గ్రామంలో బలికిరి ప్రణయ్ కుమార్ అనే ఒక కుర్రాడు.. కొద్దీ నెలల క్రితం జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో పోటీ చేశాడు.. మాల కులానికి చెందిన ఈ వ్యక్తిని గత కొంతకాలంగా తమ గ్రామ సమస్యల మీద పోరాటం చేస్తున్నందుకు చాలా రోజుల నుండి ఇతనికి అధికార పార్టీ కి సంబంధించిన వారి నుండి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.
కానీ వాటిని లెక్క చెయ్యకుండా పోరాటం కొనసాగిస్తూ అడ్డు రావడంతో ఇతని ప్రాణాలను సైతం తీసేసారు కొందరు.. అతని తల్లి పవన్ కళ్యాణ్ వద్దకి వచ్చి ‘నా బిడ్డని వైసీపీ వాళ్ళు చంపేశారు బాబు’ అంటూ ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడిన వీడియో ని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేసాడు..ఈ వీడియో చూస్తే గుండె బరువెక్కిపోతోంది..నడవలేని స్థితిలో లో ఉన్న ఆ తల్లి గోడుని చూస్తే మన కంట నుండి నీళ్లు రాక తప్పదు..వైసీపీ అరాచకాలకు అద్దంగా నిలిచిన ఈ సంఘటన చూసి సగటు సామాన్యుడు ఛీ కొడుతున్నాడు.

నిండా ముప్పై ఏళ్ళు కూడా నిండని ప్రణయ్ కుమార్ లాంటి యువకుడిని కోల్పోయిన ఆ తల్లి కడుపు కోత వైసీపీ పార్టీ నాశనానికి నాంది పలుకుతుందని సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు..ప్రణయ్ కుమార్ తల్లి కి ఆర్ధిక సహాయం చేసి.. ఆమె బాగోగులు మొత్తం కొడుకు రూపంలో నేను చూసుకుంటాను అంటూ పవన్ కళ్యాణ్ ఆమెకి భరోసా కలిపించి ఇంటికి పంపించారు.
పేరు: బలికిరి ప్రణయ్ కుమార్, చదువు: డిగ్రీ, కులం: ఎస్సీ (మాల)
తల్లి: వరలక్ష్మి (ఈమె అంగన్వాడీ కార్యకర్త),బలికిరి ప్రణయ్ డిగ్రీ చదివి ఆటో నడుపుకొనేవారు. కావలి రూరల్ మండలంలోని తుమ్మలపెంట గ్రామంలో ఎంపీటీసీ-1 నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. pic.twitter.com/yyRVeh18mE— Pawan Kalyan (@PawanKalyan) November 8, 2022