Trivikram : ఒకప్పుడు రైటర్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న త్రివిక్రమ్… ఆ తర్వాత కాలంలో దర్శకుడిగా మారి సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిద్యమైన కథాంశాన్ని చెప్పే ప్రయత్నం ఐతే చేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఆయనకు మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను కూడా సంపాదించుకుంటున్నాయి. గత సంవత్సరం ఆయన మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఎవరు ముందుకు రావడంలేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి స్టార్ హీరో అయితే అతనితో సినిమా చేస్తానని కమిట్ అయినప్పటికి మధ్యలో అట్లీ (Atlee) రావడంతో అతనితో ముందు ప్రాజెక్టు చేసి ఆ తర్వాత త్రివిక్రమ్ తో చేస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే త్రివిక్రమ్ ఇంపార్టెన్స్ హీరోల విషయంలో తగ్గిపోతుందనే చెప్పాలి. ఒకప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఆసక్తిగా ఎదురు చూసేవాడు. అతనికి డేట్స్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహాన్ని చూపిస్తూ అతని సినిమాల్లో నటించడానికి ఆరాట పడేవారు.
Also Read : వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో ‘నువ్వు నాకు నచ్చావ్ 2’ చేయబోతున్నారా..?
కానీ ఇప్పుడు మాత్రం అతన్ని పట్టించుకునేవారే పేరు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం ఆ మార్కెట్ ను అందుకోవడంలో మాత్రం చాలా వరకు వెనకబడిపోతున్నాడనే చెప్పాలి.
మరి ఇక మీదట అయిన ఆయన చేయబోయే సినిమాలతో మంచి విజయాలను సాధించి భారీ సక్సెస్ లను సంపాదించుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనే విషయాల మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.
చూడాలి మరి ఇకమీదట రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు తద్వారా ఆయన ఇలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది…ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఆయనకి తెలుగులో మాత్రమే మంచి పేరు తెచ్చాయి. ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు ఆయనకి ఇండియాలో పేరు తెచ్చే విధంగా ఉండాలి.
Also Read : అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇవ్వడం అతని అభిమానులను ఇబ్బంది పెడుతుందా..?