Yuzvendra Chahal: బలమైన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును మట్టి కరిపించి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం సాధించింది. ఉత్కంఠ గా సాగిన మ్యాచ్లో 16 పరుగుల తేడాతో గెలుపును చేసుకుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు తరఫున యజువేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.. అయితే ఈ ఘనత సాధించడం చాహల్ కు ఇదే తొలిసారి కాదు..4+ వికెట్లను పడగొట్టిన ఘనతను చాహల్ 8సార్లు సొంతం చేసుకున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్ సునీల్ నరైన్ కూడా 8 సార్లు ఈ రికార్డు సృష్టించాడు. లసిత్ మలింగ ఏడుసార్లు, రబాడ ఆరుసార్లు, అమిత్ మిశ్రా ఐదుసార్లు ఈ ఘనత సాధించారు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై 4+ వికెట్ హాల్ ను చాహల్ నాలుగు సార్లు సాధించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై ఏ బౌలర్ కూడా ఈ స్థాయిలో వికెట్లు పడగొట్టలేదు.
Also Read: ఐపీఎల్ లో తక్కువ స్కోరు చేసి.. గెలిచిన జట్లు ఇవే..
కోల్ కతా పై అరదైన రికార్డ్
కోల్ కతా జట్టుపై నాలుగు వికెట్లు సాధించి సంచలనం సృష్టించిన చాహల్.. మరో ఘనత కూడా సాధించాడు . కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై 33 వికెట్లు పడగొట్టి.. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా నిలిచాడు. పంజాబ్ జట్టుపై కూడా అతడు 32 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ జాబితాలో సునీల్ నరైన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. సునీల్ నరైన్ పంజాబ్ జట్టుపై 36 వికెట్లు పడగొట్టి.. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. పంజాబ్ జట్టుపై ఉమేష్ యాదవ్ 35 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో ఉన్నాడు. బ్రావో ఇండియన్స్ పై 33 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ పై 33 వికెట్లు పడగొట్టి మోహిత్ శర్మ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు..కోల్ కతా పై 33 వికెట్లు సాధించి చాహల్ ఐదవ స్థానంలో ఉన్నాడు. పంజాబ్ జట్టు పై 32 వికెట్లు పడగొట్టి ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. కోల్ కతా పై 32 వికెట్లు పడగొట్టి భువనేశ్వర్ కుమార్ ఏడో స్థానంలో ఉన్నాడు.
అత్యల్ప పరుగుల రికార్డులు కూడా ఇవే…
బౌలర్ల విషయం కాస్త పక్కన పెడితే.. పరుగులపరంగా అత్యల్ప స్కోర్ చేసిన జట్ల జాబితాలో పంజాబ్ మొదటి స్థానంలో ఉంది.
2017లో పూనే జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 73 పరుగులకే అలౌట్ అయింది.
బెంగళూరు జట్టుతో 2015లో జరిగిన మ్యాచ్లో 88 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
2018లో బెంగళూరు జట్టుతో ఇండోర్ లో జరిగిన మ్యాచ్లో 88 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
2025లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 111 పరుగులకే ఆల్ అవుట్ అయింది
2022లో బ్రా బౌర్న్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 115 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
ఇక 2022లో వాంఖడే లో జరిగిన మ్యాచ్లో కోల్కతా జట్టును పంజాబ్ 137 పరుగులకే ఆల్ అవుట్ చేసింది.