https://oktelugu.com/

పవన్ డైరెక్టర్ కు త్రివిక్రమ్ వార్నింగ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. కాగా ఈ చిత్ర దర్శకుడు నవీన్ కె చంద్ర అయినప్పటికీ… త్రివిక్రమ్ కర్త, కర్మ అన్నీ తానై నడిపిస్తున్నాడట. నిర్మాత సూర్యదేవర నాగవంశీ అయ్యప్పనుమ్ కోశియుమ్ స్క్రిప్ట్ త్రివిక్రమ్ చేతిలో పెట్టారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు త్రివిక్రమ్ చేయడం జరిగింది. అలాగే […]

Written By:
  • admin
  • , Updated On : December 22, 2020 / 10:27 AM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. కాగా ఈ చిత్ర దర్శకుడు నవీన్ కె చంద్ర అయినప్పటికీ… త్రివిక్రమ్ కర్త, కర్మ అన్నీ తానై నడిపిస్తున్నాడట. నిర్మాత సూర్యదేవర నాగవంశీ అయ్యప్పనుమ్ కోశియుమ్ స్క్రిప్ట్ త్రివిక్రమ్ చేతిలో పెట్టారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు త్రివిక్రమ్ చేయడం జరిగింది. అలాగే డైలాగ్ వర్షన్ కూడా త్రివిక్రమ్ రాశారట. పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా కథలో కూడా కొన్ని మార్పులు చేశారు.

    Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నప్రశాంత్ నీల్

    అయితే ఈ విషయాలన్నీ మీడియాలో రావడంపై త్రివిక్రమ్ అసహనంగా ఉన్నారట. చిత్రం గురించి అంతర్గంగా జరిగిన విషయాలు ఎలా లీక్ అవుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేయడం జరిగిందని సమాచారం. కథలో కీలమైన మార్పులు వంటి విషయాలు కూడా లీకైన నేపథ్యంలో సినిమా ఫలితంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన దర్శకుడితో అన్నాడట. సాగర్ కే చంద్ర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారు ఎవరూ… సినిమాకు సంబంధించిన విషయాలు బయట చెప్పకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పారట. ఏవిధంగా కూడా సినిమా సమాచారం ఇకపై బయటికి రాకూడని త్రివిక్రమ్ గట్టిగానే చెప్పినట్లు తెలుస్తుంది.

    Also Read: అల్లరి నరేశ్ కేరీర్ లోనే భారీ పారితోషికం ఆ సినిమాకే..

    కాగా నిన్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. వచ్చే ఏడాది చివర్లో ఈ మూవీ విడుదల కానుందని సమాచారం. దర్శకుడు క్రిష్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కూడా పక్కన పెట్టి అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీ రీమేక్ పవన్ చేస్తున్నట్లు సమాచారం. మలయాళంలో భారీ విజయం అందుకున్న ఈ చిత్రం తెలుగులో ఎన్ని సంచనాలు నమోదు చేయనుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. మరోవైపు పవన్ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇటీవల తిరిగి మొదలైన ఈ చిత్ర షూటింగ్ నిరవధికంగా జరుగుతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్