కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్.. తెలంగాణ అలర్ట్..!

యూరప్.. దక్షిణాఫ్రికా దేశాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. దీనిలో భాగంగానే తెలంగాణ సర్కార్ పకడ్బంధీ చర్యలు చేపడుతోంది. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు గతంలో రావడంతో ఈసారి అధికారులు ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది. Also Read: నాగార్జునసాగర్‌‌ను టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లోనే కరోనా టెస్టులు నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విమానం దిగిన వెంటనే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారు. […]

Written By: Neelambaram, Updated On : December 22, 2020 5:55 pm
Follow us on

యూరప్.. దక్షిణాఫ్రికా దేశాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. దీనిలో భాగంగానే తెలంగాణ సర్కార్ పకడ్బంధీ చర్యలు చేపడుతోంది. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు గతంలో రావడంతో ఈసారి అధికారులు ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

Also Read: నాగార్జునసాగర్‌‌ను టార్గెట్‌ చేసిన కాంగ్రెస్

బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లోనే కరోనా టెస్టులు నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విమానం దిగిన వెంటనే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ప్రభుత్వం నియమించింది.

తెలంగాణకు ఉన్న ఏకైక విమానశ్రమం శంషాబాద్. ఇక్కడి నుంచి బ్రిటన్ దేశానికి రోజూ నేరుగా రెండు విమానాలు.. దుబాయ్ తదితర దేశాల మీదుగా 11 విమానాలు వస్తున్నాయి. సగటున 600 మంది దాకా ప్రయాణికులు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Also Read: ప్రజలకు హెచ్చరిక: తెలంగాణను కమ్మేసిన చలి.. కారణం అదే

ఇప్పటికే బ్రిటన్.. దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ దేశాల నుంచి వచ్చేవారంతా తప్పనిసరిగా ఎయిర్‌పోర్టులో కరోనా పీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ టెస్టుల్లో వైరస్ లక్షణాలు కన్పిస్తే ప్రభుత్వ క్వారంటైన్‌కు.. నెగెటివ్ ఉంటే హోమ్ క్వారంటైన్‌కు పంపనున్నారు.

కచ్చితంగా వారంరోజులపాటు వీరంతా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ గత రెండు వారాల్లో బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినవారి వివరాలను సేకరించే పనిలో పడింది. వీరి కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్కును కూడా ఏర్పాటు చేసింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్