అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ ఉత్సవాలకు ప్రధాని మోదీ

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) శతాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్నారు. అయితే ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. 56 సంవత్సరాలలో ఏఎంయూ ఉత్సవాలకు భారత ప్రధాని హాజరు కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా మోదీ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేయనున్నట్లు విశ్వవిద్యాలయ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్స్ లర్ సయ్యద్నా ముఫద్దల్ సైపుద్దీన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ […]

Written By: Velishala Suresh, Updated On : December 22, 2020 10:30 am
Follow us on

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) శతాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్నారు. అయితే ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. 56 సంవత్సరాలలో ఏఎంయూ ఉత్సవాలకు భారత ప్రధాని హాజరు కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా మోదీ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేయనున్నట్లు విశ్వవిద్యాలయ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్స్ లర్ సయ్యద్నా ముఫద్దల్ సైపుద్దీన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్న ప్రధాని మోదీకి ఏఎంయూ సంఘం కృతజ్ఞతలు తెలిపింది.