Homeఎంటర్టైన్మెంట్Trisha Vijay rumors : విజయ్ తో పెళ్లి వ్యవహారంపై ఒకే ఒక్క పోస్ట్ తో...

Trisha Vijay rumors : విజయ్ తో పెళ్లి వ్యవహారంపై ఒకే ఒక్క పోస్ట్ తో సమాధానం ఇచ్చిన హీరోయిన్ త్రిష..

Trisha Vijay rumors : గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో హీరోయిన్ త్రిష(Trisha Krishnan) పై నడుస్తున్న రూమర్స్ ని మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రముఖ తమిళ సూపర్ స్టార్ , TVK పార్టీ అధినేత విజయ్(Thalapathy Vijay) తో ప్రేమాయణం నడుపుతుందని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని , ఇలా రక రకాల వార్తలు వచ్చాయి. స్వయంగా వీళ్లిద్దరు కలిసి కొన్ని ఈవెంట్స్ లో కూడా పాల్గొనడం తమిళనాడు మొత్తం హాట్ […]

Trisha Vijay rumors : గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో హీరోయిన్ త్రిష(Trisha Krishnan) పై నడుస్తున్న రూమర్స్ ని మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రముఖ తమిళ సూపర్ స్టార్ , TVK పార్టీ అధినేత విజయ్(Thalapathy Vijay) తో ప్రేమాయణం నడుపుతుందని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని , ఇలా రక రకాల వార్తలు వచ్చాయి. స్వయంగా వీళ్లిద్దరు కలిసి కొన్ని ఈవెంట్స్ లో కూడా పాల్గొనడం తమిళనాడు మొత్తం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలాంటి పరిస్థితిలో ఇన్ స్టాగ్రామ్ లో త్రిష పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు , అభిమానులను ఆమె అయ్యోమయ్యం లోకి నెట్టేసింది. ఆమె మాట్లాడుతూ ‘ఇన్ని రోజులు నేను సినిమాలు మానేస్తున్నాను అని, ఒక పెద్ద వ్యాపార వేత్తని పెళ్లి చేసుకొని నలుగురు పిల్లల్ని కన్నాను అంటూ రకరకాల ఫిక్షన్ స్టోరీ లను అల్లినారు. ఇప్పుడు కూడా అలాంటివి ఏమైనా మిగిలి ఉన్నాయా?’ అని వ్యంగ్యంగా తనపై జరుగుతున్నా ప్రచారం పై స్పందించింది.

సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో రూమర్స్ వినిపిస్తున్న సమయం లో వాటికి బ్రేక్ వెయ్యాల్సింది పోయి, విజయ్ తో కలిసి ఈవెంట్స్ లో పాల్గొని, సమాజానికి మేమిద్దరం కలిసే ఉన్నాం అని చెప్పకనే చెప్పినట్టు చెప్పి , ఇప్పుడు అకస్మాత్తుగా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది ఏంటి ?. అంటే ఎన్నికలలో ఓట్ల క్లొసం విజయ్ కొన్నాళ్ళు ఇది రూమర్ గానే ఉంచుదామని త్రిష తో చెప్పి ఇలాంటి పోస్ట్ వేయించాడా?, లేదంటే వేరే ఏదైనా ఉద్దేశ్యం దాగుందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. అంతే కాకుండా త్రిష తెలివి గా ‘నేను ఒక ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

విజయ్ వ్యాపార వేత్త కాదు , సినీ నటుడు , రాజకీయ నాయకుడు. చాలా తెలివి ని ఉపయోగిస్తూ ఆమె ఇలాంటి కామెంట్ చేసిందని అంటున్నారు నెటిజెన్స్. అయితే త్రిష తనపై వచ్చేవి మొత్తం రూమర్స్ అని చెప్పే ప్రయత్నం అయితే చేసింది కానీ , జనాలు దానిని నమ్మే పరిస్థితిలో లేరు. ఇలాంటి హై డ్రామాలు చూసి చూసి బాగా పడిపోయారు, ఇలాంటి సమయం లో ఇలాంటి అవుట్ డేటెడ్ స్ట్రాటజీలకు పడిపోయేంత అమాయకత్వం ఇప్పుడు జనాల్లో లేదు. కచ్చితంగా వీళ్లిద్దరు ఎన్నికల తర్వాత పెళ్లి చేసుకుంటారు చూడండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper