https://oktelugu.com/

అరె త్రిష పెళ్లి అట.. నిజమేనా !

చెన్నై బ్యూటీ త్రిషకి ఇప్పుడు వయస్సు 37 సంవత్సరాలు.. మరో మూడు నెలల్లో 38 రాబోతున్నాయి. అవ్వాల్సిన ఏజ్ లో పెళ్లి అయి ఉంటే.. త్రిష కూతురు కూడా ఈ పాటికే టీనేజ్ లోకి వచ్చి ఉండేది. కానీ ఏమి చేస్తాం.. త్రిషకు సరైన పార్టనర్ దొరకడం లేదట. అయితే తాజాగా, త్రిష పెళ్లికి సంబంధించిన మేటర్ ఒకటి తెలిసింది. త్వరలోనే త్రిష పెళ్లి ఉంటుందని కూడా చెబుతున్నాయి తమిళ మీడియా వర్గాలు. Also Read: లైంగిక […]

Written By:
  • admin
  • , Updated On : January 16, 2021 / 05:05 PM IST
    Follow us on


    చెన్నై బ్యూటీ త్రిషకి ఇప్పుడు వయస్సు 37 సంవత్సరాలు.. మరో మూడు నెలల్లో 38 రాబోతున్నాయి. అవ్వాల్సిన ఏజ్ లో పెళ్లి అయి ఉంటే.. త్రిష కూతురు కూడా ఈ పాటికే టీనేజ్ లోకి వచ్చి ఉండేది. కానీ ఏమి చేస్తాం.. త్రిషకు సరైన పార్టనర్ దొరకడం లేదట. అయితే తాజాగా, త్రిష పెళ్లికి సంబంధించిన మేటర్ ఒకటి తెలిసింది. త్వరలోనే త్రిష పెళ్లి ఉంటుందని కూడా చెబుతున్నాయి తమిళ మీడియా వర్గాలు.

    Also Read: లైంగిక వేధింపుల గురించి మళ్ళీ చెప్పుకొచ్చింది !

    ఎలాగూ ఇప్పటికే రానాకి కూడా పెళ్లి అయిపోయింది కాబట్టి.. ఇక త్రిష కూడా రేపోమాపో పెళ్లి చేసుకుంటుందంటూ మొత్తానికి పుకార్లు అయితే గట్టిగానే పుట్టిస్తున్నారు. వాటికి బలం చేకూర్చేలా త్రిష కూడా ప్రవర్తిస్తోందట. నిజానికి రానా, త్రిష చాన్నాళ్లు డేటింగ్ చేశారని.. రానా కూడా ఈ విషయాన్నీ బయటపెట్టాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, రానా మిహీక బజాజ్ ని పెళ్లి చేసుకున్నాడు. అందుకే త్రిష కూడా ఇప్పుడు సీరియస్ గా పెళ్లి గురించి థింక్ చేస్తోందట.

    Also Read: ఆమె కెరీర్ లో అతి పెద్ద తప్పు అదేనట !

    ఇక ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన త్రిష‌కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు అయితే లేవు. అందుకే, కొన్నాళ్ల క్రితమే పెళ్లి చేసుకునేందుకు త్రిష రెడీ అయింది. పైగా వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుని, అతనితో స్పెషల్‌ ఫ్లైట్‌లో విహారయాత్ర కూడా చేసింది ఈ ముదురు బ్యూటీ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ, ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయి.. చివరకు త్రిషను ఒంటరిని చేసింది. మధ్యలో శింబు లాంటి హీరోలతో సరదాగా కొన్ని ట్రిప్ లు వేసినా.. పెళ్లి గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. కానీ చాల నెలలు తరువాత త్రిష పెళ్లి అంటూ మళ్ళీ వార్తలు వస్తున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్