ఖర్చు పెట్టేది కేంద్రంలోని ప్రధాని మోడీ అయితే.. ప్రచారంతో డప్పు కొట్టుకున్నది మాత్రం ఏపీ సీఎం జగన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనాతో ప్రపంచమే అల్లకల్లోలమైన నేపథ్యంలో రెండు కరోనా టీకాలకు కేంద్రం అనుమతించి వాటిని వాడుకలోకి తెచ్చి మొదట వైద్యులు, వైద్యసిబ్బంది.. ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.
Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త.. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసే ఛాన్స్..?
ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్న చందంగా ఏపీ సర్కార్ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడంపై ఏపీ బీజేపీ భగ్గుమంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మేరకు ఫేస్ బుక్ లో కడిగేశారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కోవిడ్ వ్యాక్సినేషన్ ఈరోజు దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సందర్భంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని ఉపన్యాసాల్ని.. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రదర్శన చేస్తున్నాయని.. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడప లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ పోస్టర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోటో లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ సందర్భంలో కూడా మోదీ ఫొటో వేయకుండా అలసత్వం వహించిందని ఆరోపించారు. సంబంధిత అధికారులు మీద చర్యలు తీసుకోవాల్సిందిగా భేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలవసిందిగా డిమాండ్ చేశారు.
Also Read: అయోధ్య శ్రీరామ మందిరానికి సోము వీర్రాజు విరాళం
ఇలా దేశమంతా మోడీ వ్యాక్సినేషన్ ప్రక్రియను గొప్పగా పొగుడుతుంటే ఆ క్రెడిట్ ను కూడా జగన్ సర్కార్ తనదిగా చెప్పుకోవడమే ఇక్కడి విచిత్రంగా కనిపిస్తోంది. ఏపీ బీజేపీ దీన్ని నిగ్గదీసి అడగడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్