https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ 8′ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ గా టాప్ మోస్ట్ కమెడియన్.. శేఖర్ బాషా అతన్ని తట్టుకోగలడా!

అవినాష్ కామెడీ టైమింగ్ కి, శేఖర్ బాషా వదిలే పంచులకు మధ్య పోటీ జరిగితే ఎవరూ ఎవరిని డామినేట్ చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇద్దరూ ఇద్దరే, చూడాలి మరి. ఈ వారంలోనే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆయన హౌస్ లోకి వస్తాడని టాక్ వినిపించింది. బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది, అదే సమయంలో వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉంటుందని అన్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 8, 2024 / 09:28 PM IST

    Mukku Avinash

    Follow us on

    Bigg Boss Telugu 8 :  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎంత రసవత్తరంగా సాగుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. టాస్కులతో పాటుగా హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య హీట్ వాతావరణంలో జరిగే చర్చలు, సంఘటనలు కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో శేఖర్ బాషా ఒక్కడే ప్రేక్షకులకు నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ ని పంచుతూ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఇతను వేసే జోక్స్ కి కంటెస్టెంట్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు ఎలా వస్తాయండి ఇలాంటి ఆలోచనలు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ సైతం మాట్లాడుకుంటున్నారు. కేవలం ఎంటర్టైన్మెంట్ పంచడంలో మాత్రమే కాదు, లాజికల్ గా ఇతను మాట్లాడే రేంజ్ లో హౌస్ లో ఏ కంటెస్టెంట్ కూడా మాట్లాడలేడు, టాస్కులు కూడా అత్యద్భుతంగా ఆడుతున్నాడు, చాలా ఫోకస్ తో ఉన్నాడు. టైటిల్ కొట్టేందుకు శేఖర్ భాషకి అన్ని విధాలుగా అర్హతలు ఉన్నాయి.

    అయితే ఇతనికి పోటీ గా ఎంటర్టైన్మెంట్ అందించడానికి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో కంటెస్టెంట్ అతి త్వరలోనే రాబోతున్నాడు. అతను మరెవరో కాదు, ముక్కు అవినాష్. బిగ్ బాస్ సీజన్ 4 లో అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇచ్చి, ఇంకో రెండు వారాల్లో సీజన్ ముగుస్తుంది అనగా ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ తోనే ఆయన రాబోతున్నాడు. బిగ్ బాస్ తర్వాత మనం అవినాష్ ని చాలా ఎంటర్టైన్మెంట్ షోస్ లో చూస్తూనే ఉన్నాం. అతని కామెడీ టైమింగ్ కి నవ్వని వారంటూ ఎవరూ ఉండరు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే అన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ లో అవినాష్ ఉండాల్సిందే. అలా తయారైంది ఆయన రేంజ్. మరి అవినాష్ కామెడీ టైమింగ్ కి, శేఖర్ బాషా వదిలే పంచులకు మధ్య పోటీ జరిగితే ఎవరూ ఎవరిని డామినేట్ చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇద్దరూ ఇద్దరే, చూడాలి మరి. ఈ వారంలోనే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆయన హౌస్ లోకి వస్తాడని టాక్ వినిపించింది. బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది, అదే సమయంలో వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉంటుందని అన్నారు.

    కానీ అది జరగలేదు. మరి అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఈ వారం మధ్యలో ఉంటుందా, లేదా మూడవ వారం లో ఉంటుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అవినాష్ తో పాటు మరో ఆరు మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలకు రాబోతున్నారు, అందులో ఒకరు అవినాష్ అని తెలిసిపోయింది, మిగిలిన 5 మంది కంటెస్టెంట్స్ ఎవరూ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇదంతా పక్కన పెడితే సీజన్ 7 నుండి శోభా శెట్టి, సీజన్ 6 నుండి శ్రీ సత్య కూడా హౌస్ లోకి రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి కేవలం పుకార్లు మాత్రమే, అసలు నిజం ఏమిటి అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.