https://oktelugu.com/

Bollywood News : రక్తం కారుతున్న వదలకుండా స్టార్ హీరోయిన్ పెదవులను కొరికేసిన 42 ఏళ్ళ హీరో..ఆయన ఎవరో మీరే చూడండి!

అయినా వినోద్ ఖాన్నా వదలలేదు, చివరికి డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ మైక్ విసిరగొట్టి గట్టిగా కట్ అని కోపంగా అరవడంతో వినోద్ ఖానా స్పృహ లోకి వచ్చి మాధురి దీక్షిత్ ని వదిలేసాడు.

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2024 / 09:33 PM IST

    42-year-old hero Vinod Khanna bit the lips of star heroine Madhuri Dixit

    Follow us on

    Bollywood News : కొంతమంది నటీనటులు తమ పాత్రల్లో ఎంతలా లీనం అవుతారంటే, పక్కన ఏమి జరుగుతుంది, చుట్టూ పక్కన ఎవరూ ఉన్నారు అనేది కూడా ఆలోచించరు. అంతలా లీనమై నటిస్తుంటారు, అలాంటి సందర్భాలలో కొన్ని చేదు అనుభవాలు ఎదురు అవుతుంటాయి. అలాంటి అనుభవం మాధురి దీక్షిత్ కి అప్పట్లో ఎదురైంది. ఈమె ఒకప్పుడు బాలీవుడ్ లో నెంబర్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈమె అందం, ఈమె నటన, ఈమె నృత్యం ఇలా ఒక్కటా రెండా, ఇన్ని అద్భుతమైన అంశాలు ఒక హీరోయిన్ లో దొరకడం చాలా అరుదు. అందుకే ఆమె బాలీవుడ్ ని ఆ స్థాయిలో ఏలింది. మాధురి దీక్షిత్ నటించింది అంటే ఆ సినిమా కచ్చితంగా హిట్టే అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యేవారు.

    కేవలం ఈమె కోసమే థియేటర్స్ కి క్యూలు కట్టే ఆడియన్స్ అప్పట్లో లక్షల్లో ఉండేవారు, అందుకే నిర్మాతలు ఆమె ఎంత రెమ్యూనరేషన్ అడిగినా, కాదు అనకుండా ఇచ్చేవారు, ఆమె కాల్ షీట్స్ కోసం క్యూలు కట్టేవారు. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇదే సినిమాని హిందీ లో వినోద్ ఖన్నా, మాధురి దీక్షిత్ లు హీరో హీరోయిన్లు గా, ఫిరోజ్ ఖాన్ దర్శకత్వం లో రీమేక్ చేసారు. హిందీ లో కూడా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో వినోద్ ఖన్నా, మాధురి దీక్షిత్ మధ్య వచ్చే లిప్ లాక్ సన్నివేశం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఈ సన్నివేశం చేస్తున్నప్పుడు వినోద్ ఖన్నా తనని తాను మర్చిపోయాడు. సన్నివేశం లో లీనమైపోయాడు, మాధురి దీక్షిత్ పెదాలను ముద్దాడే క్రమం లో ఆమె పెదవులను గట్టిగా కొరికేసాడు. డైరెక్టర్ కట్ చెప్తున్నా కూడా వినకుండా మాధురి దీక్షిత్ పెదాలను కోరుకుతూనే ఉన్నాడు. దీంతో ఆమె పెదాలు చిట్లిపోయి, రక్తం కారింది.

    అయినా వినోద్ ఖాన్నా వదలలేదు, చివరికి డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ మైక్ విసిరగొట్టి గట్టిగా కట్ అని కోపంగా అరవడంతో వినోద్ ఖానా స్పృహ లోకి వచ్చి మాధురి దీక్షిత్ ని వదిలేసాడు. పెదాల నుండి వస్తున్న రక్తాన్ని తుడుచుకుంటూ, మాధురి దీక్షిత్ ఏడ్చుకుంటూ సెట్స్ నుండి వాక్ అవుట్ అయ్యింది. పాపం ఆమె వారం రోజులు సరిగా ఈ దెబ్బకు అన్నం కూడా తినలేకపోయిందట. అయితే ఈ సంఘటన జరిగిన పక్కరోజే వినోద్ ఖన్నా, డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ తో కలిసి మాధురి దీక్షిత్ ఇంటికి వెళ్లి, ఆమెకి క్షమాపణలు చెప్పాడట. దీనికి ఒప్పుకున్నా మాధురి, మిగిలిన షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసింది. ఈ సంఘటన జరిగినప్పుడు మాధురి దీక్షిత్ కి కేవలం 20 ఏళ్ళు మాత్రమే, కానీ వినోద్ ఖన్నా కి 42 ఏళ్ళు ఉంటాయి.