Top 5 richest heroes in Telugu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇతర ఇండస్ట్రీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ ని టాప్ లెవెల్ కి తీసుకెళ్లడంలో కృషి చేస్తున్నారు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే వరుస సినిమాలను చేస్తున్న మన హీరోలు ఎప్పటికప్పుడు వాళ్ళ పంథా ను మారుస్తూ ఈ జనరేషన్లో ఉన్న ప్రేక్షకులు ఎలాంటి సినిమాలైతే కోరుకుంటున్నారో అలాంటి కథలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం….. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ప్రతి ఒక్కరు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న వాళ్లే కావడం విశేషం… ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్లను తీసుకుంటూ రిచెస్ట్ పర్సన్స్ గా మారుతున్నారు. ఇక తెలుగులో ఇప్పటి వరకు ఉన్న టాప్ ఫైవ్ రిచెస్ట్ హీరోలు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Read Also: రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ ను జరుపుకున్న అఖండ 2…
ఇక ఈ లిస్ట్ లో మొదటగా నాగార్జున ఉన్నాడు. సినిమా ఇండస్ట్రీలో అతను రెమ్యునరేషన్స్ ను భారీ రేంజ్ లో తీసుకుంటూనే చాలా బిజినెస్ లను రన్ చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం ఇటు హీరో గానే కాకుండా అటు బిజినెస్ మాన్ గా కూడా టాప్ పొజిషన్లో ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక నాగార్జున ఆస్తుల విలువ ఎనిమిది వేల కోట్ల వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఈ లిస్టులో నెంబర్ 2 పొజిషన్లో మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. అలాగే భారీ రెమ్యూనరేషన్స్ ను తీసుకుంటూనే అతను కూడా కొన్ని బిజినెస్ లను అయితే చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఉన్న ఆస్తులను బట్టి చూస్తే ఆయనకి దాదాపు 7,000 కోట్ల వరకు ఆస్తులైతే ఉన్నాయి…
ఇక ఈ లిస్టులో నెంబర్ 3 పొజిషన్లో రామ్ చరణ్ ఉన్నాడు. రామ్ చరణ్ సినిమాకి 100 కోట్లకు పైన రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. ఇక దాంతోపాటుగా ఉపాసన కూడా చాలా బిజినెస్ లను రన్ చేస్తోంది. అపోలో హాస్పిటల్స్ మొత్తాన్ని ఉపాసన చూసుకుంటుంది. కాబట్టి వీళ్ల నెట్ వర్త్ దాదాపు 6000 కోట్ల వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది…
Read More: ‘స్టాలిన్’ రీ రిలీజ్ కి డిజాస్టర్ రెస్పాన్స్..ప్రింట్ ఖర్చులు కూడా రాలేదుగా!
ఇక ఈ లిస్ట్ లో నెంబర్ 4 లో జూనియర్ ఎన్టీఆర్ ఉండడం విశేషం…ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా కోసం 100 కోట్ల కు పైన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. దాంతో ఆయన భారీ రేంజ్ లో డబ్బులను పోగేశాడు. ఇక దానితోపాటుగా తన భార్య అయిన లక్ష్మీ ప్రణీతి సైతం కొన్ని బిజినెస్ లను చూసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నెట్ వర్త్ 5500 కోట్లుగా ఉంది…
ఇక నెంబర్ ఫిఫ్త్ పొజిషన్ లో బాలకృష్ణ, మహేష్ బాబులు ఉన్నారు. వీళ్ళిద్దరి నెట్ వర్త్ 5000 కోట్ల వరకు ఉండడం విశేషం…
ఇక ఈ లిస్ట్ లో వెంకటేష్, పవన్ కళ్యాణ్ లు వీళ్ల తర్వాత పొజిషన్ లో ఉండటం వల్ల అభిమానులను కొంతవరకు నిరాశ చెందుతున్నారు…