Homeఆంధ్రప్రదేశ్‌Duvvada Srinivas Plan : దువ్వాడ ప్లాన్ వర్కౌట్!

Duvvada Srinivas Plan : దువ్వాడ ప్లాన్ వర్కౌట్!

Duvvada Srinivas Plan: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ). ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక సాధారణ నేత. ఒక సామాన్య ఎమ్మెల్సీ. ఈరోజు ఆయన సెలబ్రిటీగా మారడానికి కారణం ఆయన కుటుంబంలో తలెత్తిన వివాదం, మరో మహిళతో సన్నిహిత సంబంధం. ఆయన వైఖరితో పార్టీకి డ్యామేజ్ జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపించేశారు జగన్. ఏకంగా సస్పెన్షన్ వేటు వేశారు. మరోవైపు మరో మహిళతో అనైతిక బంధం ఏర్పరచుకోవడంతో ఆయనపై అందరిలోనూ వ్యతిరేక భావన ఏర్పడింది. చులకన భావం కూడా ఏర్పడింది. మరోవైపు ఏ రాజకీయ పార్టీ కూడా ఆయనను చేరదీయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ చాలా చతురతతో వ్యవహరించారు. తనపై ఇతరులు టార్గెట్ చేయకుండా వ్యూహం పన్నారు. అందులో సక్సెస్ అయ్యారు.

Also Read: కాంగ్రెస్ తో జగన్ రాజీ?

వ్యక్తిగత వ్యవహార శైలితో..
టెక్కలి( Tekkali ) నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు దువ్వాడ శ్రీనివాస్. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కుటుంబంలో రచ్చ జరిగింది. చాలా రకాల ఎపిసోడ్లు నడిచాయి. జగన్మోహన్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. దివ్వేల మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ హైదరాబాద్ వెళ్ళిపోయారు. అక్కడ వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టారు. రాజకీయాలను తగ్గించుకుంటారని అంతా భావించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో దువ్వాడ శ్రీనివాస్కు భారీ డ్యామేజ్ జరిగింది. ఆయనపై విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో పెరిగింది. అనైతిక బంధాన్ని ఏర్పరచుకున్నారన్న అపవాదు ఆయనపై ఉంది. అయితే ఆ వ్యతిరేకత తగ్గించుకోవడానికి ఆయన తాజాగా చేసిన ప్రయత్నం కొంత ఫలితం ఇచ్చింది.

అలా వ్యతిరేకత తగ్గించుకొని..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో పవన్ కళ్యాణ్ పట్ల విపరీతమైన వ్యాఖ్యలు చేసేవారు దువ్వాడ శ్రీనివాస్. ఆపై చంద్రబాబుతో పాటు లోకేష్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సహజంగానే ఇది జనసేన తో పాటు టిడిపి శ్రేణులకు మింగుడు పడదు. అయితే ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ వైఖరిలో మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ విషయంలో సానుకూల ప్రకటనలు చేశారు. చిరంజీవి పట్ల విపరీతమైన అభిమానాన్ని చూపారు. అదే సమయంలో లోకేష్ విషయంలో కూడా కొంచెం ప్రశంసిస్తూ మాట్లాడారు. దీంతో సహజంగానే ఆయన వైఖరిలో మార్పు రావడంతో టిడిపి, జనసేనల పార్టీ శ్రేణుల్లో సైతం కొంత సానుకూలత ఏర్పడింది.

Also Read: జగన్ కు కేంద్రం షాక్

కాలింగులపై కుట్ర
అయితే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్( Konar Ravi Kumar ) ఇటీవల తన నియోజకవర్గంలోని ఓ కేజీబీవీ ప్రిన్సిపాల్ తో అసభ్యంగా మాట్లాడాలని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం నడుస్తుండగానే దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. రవికుమార్ వెనుక భారీ కుట్ర జరిగిందని ఆరోపణలు చేశారు. ఇక్కడ పార్టీల పేరు ఎత్తకుండా.. తన ప్రత్యర్థులుగా భావిస్తున్న కింజరాపు, ధర్మాన కుటుంబాలే ఈ కుట్రకు పాల్పడ్డాయని.. కాలింగ కులం పై గత కొన్నేళ్లుగా కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న కాళింగ సామాజిక వర్గం వారిని కొంత ఆలోచనలో పడేశారు. కాలింగుల పునరేకికరణ జరగాలని దువ్వాడ శ్రీనివాస్ కోరుతున్నారు. తద్వారా తన ప్రత్యర్థులుగా ఉన్న ధర్మానతో పాటు కింజరాపు కుటుంబాలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అయితే అది అంత ఈజీ కాకున్నా.. తనపై ఉన్న నెగిటివ్ భావాన్ని తగ్గించుకోవడంలో మాత్రం దువ్వాడ సక్సెస్ అయినట్టే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular