Highest Remuneration Hero: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఏ భాషలో ఎవరు సినిమా చేసిన కూడా ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాని చూసి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…అందుకే ఒక సినిమా సూపర్ సక్సెస్ అయిందంటే ఆ సినిమాకి భారీ రేంజ్ లో ఆదరణ అయితే దక్కుతోంది. ఒక సినిమా ఫ్లాప్ అయింది అంటే మాత్రం దేశంలో ఉన్న ఏ ఒక్క ప్రేక్షకుడు కూడా ఆ సినిమాను చూడడానికి పెద్దగా ఆసక్తిని చూపించకపోవడం విశేషం…ఇక ఇప్పుడు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న హీరోలందరు 100 కోట్లకు పైన రెమ్యూనరేషన్ ను ఛార్జ్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…అయితే ఇప్పటివరకు ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ను తీసుకున్న హీరో ఎవరు అంటూ గత కొన్ని రోజుల నుంచి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక దీనికి సమాధానంగా కొంతమంది క్లారిటి ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు…శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన రోబో 2 సినిమా కోసం రజనీకాంత్ 180 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకున్నారట. ఇప్పటివరకు హీరోలు తీసుకున్న రెమ్యూనరేషన్ లో ఇదే ఎక్కువ అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఓజీ vs అఖండ 2 పోటీలో వెనక్కి తగ్గిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
ఇక కొంతమంది మాత్రం ‘పుష్ప 2’ సినిమా కోసం అల్లుఅర్జున్ 300 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చినప్పటికి వాటిలో నిజమైతే లేదంటూ సినిమా ప్రొడ్యూసర్స్ సైతం తేల్చి చెప్పేశారు. కాబట్టి ఇప్పటివరకు రజనీకాంత్ రోబో 2 సినిమా కోసం తీసుకున్న 180 కోటా పారితోషికమే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ గా తెలుస్తోంది.
ఇక తమిళ్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని తీసుకున్న హీరోగా ఇండియాలో ఒక చరిత్రను క్రియేట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… ఇక ఇప్పుడున్న పాన్ ఇండియా హీరోలు సైతం 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా రజనీకాంత్ టాప్ పొజిషన్లో నిలిచాడనే చెప్పాలి… మరి రజనీకాంత్ లాంటి హీరోకి ఇండియా వైడ్ గా మంచి పాపులారిటీ ఉంది.
Also Read: తెలుగు లో టాప్ 5 రిచెస్ట్ హీరోలు వీళ్లేనా..?ఈ లిస్ట్ లో ఆ ఇద్దరు టాప్ హీరోలు లేరా.?
కాబట్టి అతనికి అప్పట్లోనే ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ను ఇచ్చారు. మరి మొత్తానికైతే రీసెంట్ గా రజనీకాంత్ కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడ్డట్టుగా తెలుస్తోంది…