Stalin Re Release: నేడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) 70 వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్ లో ఎంతో స్పెషల్ గా నిల్చిన ‘స్టాలిన్'(Stalin Re Release) చిత్రాన్ని గ్రాండ్ గా మరోసారి రీ రిలీజ్ చేసారు. ఈ చిత్రం ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కాలం గడిచే కొద్దీ ఈ చిత్రానికి మిగిలిన కొన్ని సినిమాలు లాగా క్రేజ్, లేదా కల్ట్ క్లాసిక్ స్టేటస్ వంటివి కూడా ఈ చిత్రానికి దక్కలేదు. అలాంటి సినిమా ని రీ రిలీజ్ కి ఎంచుకోవడం కచ్చితంగా పొరపాటే, అందుకే ఈ చిత్రం రీ రిలీజ్ కి డిజాస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ చిత్రాన్ని 4K ప్రింట్ కి మార్చడానికి అయిన ఖర్చు పాతిక లక్షల రూపాయిలు అయ్యింది అట.
Also Read: రజినీకాంత్ – కమల్ హాసన్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందా..? పట్టాలెక్కేది ఎప్పుడంటే..?
రెండు తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి కనీసం 20 లక్షల రూపాయిల గ్రాస్ కూడా రాలేదట. అందులో షేర్ 10 లక్షలు ఉంటుంది. నిర్మాత నాగబాబు కి ఈ సినిమా రీ రిలీజ్ కారణంగా 15 లక్షల రూపాయిల నష్టమట. గతం లో నాగబాబు తాను నిర్మించిన ఆరెంజ్ చిత్రాన్ని రీ రిలీజ్ చేశాడు. డైరెక్ట్ రిలీజ్ లో డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ఈ చిత్రం రీ రిలీజ్ లో మాత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. రెండు సార్లు రీ రిలీజ్ చేస్తే, రెండు సార్లు కూడా అద్భుతమైన రెస్పాన్ ఈ చిత్రానికి వచ్చింది. ఆరెంజ్ సినిమా హిట్ అయ్యింది కదా అని, స్టాలిన్ కూడా వర్కౌట్ అవ్వుదేమో అనుకోని విడుదల చేసి ఉంటారు. కానీ అన్ని సార్లు మ్యాజిక్స్ రిపీట్ అవ్వడం కష్టం కదా, అందుకే ఈ సినిమాకు ఈ రీ రిలీజ్ ప్లాన్ బెడిసికొట్టింది.
మరో నెల రోజుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘ఓజీ’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసమే డబ్బులు దాచుకునే ప్రక్రియ లో స్టాలిన్ సినిమాని రిజెక్ట్ చేసి ఉంటారని కొందరు, చిరంజీవి సినిమాల్లో ఫ్లాప్ చిత్రం గా భావించి ఈ చిత్రానికి ఎవ్వరు వెళ్లలేదని మరికొందరు అంటున్నారు. కొంతమంది అయితే అతడు సినిమా కి తక్కువ కలెక్షన్స్ వచ్చినప్పుడే టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ పడిపోయింది, అందుకే స్టాలిన్ ని ఎవ్వరూ పట్టించుకోలేదని అంటున్నారు. వీటిలో ఏది వాస్తవమో చెప్పలేము కానీ, ఈ సినిమాకు బదులుగా ‘శంకర్ దాదా MBBS’ చిత్రాన్ని ఎంచుకొని ఉండుంటే కచ్చితంగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేది అని అభిమానుల వాదన.