Heroes : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ప్రస్తుతం స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాటపడుతూ వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి. తద్వారా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా? లేదా అనే విషయాల పట్ల సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు. తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. మరి దానికి తగ్గట్టుగానే ఇకమీదట చేయబోతున్న సినిమాలతో కూడా మంచి విజయాలను సాధించాలని లక్ష్యంతో దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో టాప్ 5 నెంబర్స్ లో ఉన్నవారు ఎవరు అనేదానిమీద సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో కొనసాగుతున్న నటుడు ప్రభాస్ (Prabhas)అనే చెప్పాలి. ఆయన చేసిన బాహుబలి (Bahubali) సినిమా సూపర్ హిట్ అయింది.
Also Read : ఆ హీరోలకు రెమ్యునరేషన్ భారీ గా ఉంది..కానీ హిట్టు కొట్టలేకపోతున్నారు..?
ఇక అప్పటి నుంచి హిట్టు ఫ్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నాడు. ఇక అతని తర్వాత దళపతి విజయ్ కి చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. ఆయన సినిమాలు చేసిన చేయకపోయిన కూడా ఆయన క్రేజ్ పదిలంగా ఉంటూ ముందుకు సాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక వీళ్ళ ఇద్దరి తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) కి మంచి గుర్తింపైతే వచ్చింది. పుష్ప2 సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో స్టార్ హీరో ఇమేజ్ రావడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్లిపోయాడు. ఇక నెంబర్ ఫోర్ పొజిషన్ లో రామ్ చరణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన ఆ సినిమా కోసం విపరీతంగా కష్టపడినట్టుగా తెలుస్తోంది.
ఇక దాంతోపాటుగా ఆయన నటనలో పరిణితిని కూడా చూపించి టాప్ నటుడిగా ఎదిగాడు ఇక నెంబర్ ఫైవ్ పొజిషన్ లో షారుక్ ఖాన్ ఉన్నాడు. ఇక ఈ సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఈ స్టార్ హీరో మరోసారి తను ఇండస్ట్రీ హిట్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటివరకైతే ఆయన నెంబర్ 5 పొజిషన్ లో కొనసాగుతూ ఉండటం విశేషం.
Also Read : ఆ విషయం లో స్టార్ హీరోలను చూసి కుర్ర హీరోలు రిస్క్ చేస్తున్నారా..?