War 2
War 2: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇట్లాంటి సందర్భంలో బాలీవుడ్ దర్శకులు ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తారు అనే దాని మీద కూడా చాలా రకాల వార్తలైతే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ కి ‘ఆది పురుషు’ సినిమాతో భారీ దెబ్బేసిన ఓం రావత్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు వార్ 2 సినిమాతో కూడా మరోసారి ఎన్టీఆర్ కి దెబ్బ వెయ్యబోతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఎన్టీఆర్ మాత్రం చాలా క్లియర్ గా ఉంటూ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రతి సీన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడట. ముందుగా తనకు ఏ సీన్లు అయితే చెప్పారో వాటిని షూట్ చేస్తున్నారా లేదా అంటూ క్రాస్ చెక్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి ఫైటింగ్ అయితే చేయబోతున్నారట.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో భారీ ఫైట్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయట. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ ని హాలీవుడ్ మేకర్స్ చేత చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఎన్టీయార్ బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నాడు.
మరి ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే అక్కడ ఇక్కడ పార్లల్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాడా లేదంటే బాలీవుడ్ సినిమాలు మాత్రమే చేస్తాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Will there be a fight scene in war 2 beyond rrr