Dil Raju Mega Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో దిల్ రాజు (Dil Raju) మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా తన బ్యానర్ ని ముందుకు తీసుకెళ్తూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేస్తూ వచ్చాడు. ఆయన బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది మినిమం గ్యారంటీ సినిమాగా ఉంటుందని ప్రతి ఒక్క ప్రేక్షకుడు అనుకునే స్థాయికి తన బ్యానర్ ని తీసుకెళ్లాడు. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ దక్కినటువంటి క్రేజ్ ను సంపాదించుకున్న నిర్మాత కూడా తనే కావడం విశేషం…అయితే తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్(Shankar) డైరెక్షన్లో రామ్ చరణ్ (Ram Charan) ను హీరోగా పెట్టి చేసిన గేమ్ చేంజర్ (Game Changer) సినిమా భారీ డిజాస్టర్ ని మిగిల్చింది. ఒకరకంగా చెప్పాలంటే దిల్ రాజు ఇప్పటివరకు సంపాదించుకున్న స్టార్ డమ్ మొత్తాన్ని పాతాళంలో కలపడమే కాకుండా తనకు భారీగా నష్టాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ విషయం మీద గత కొద్దిరోజుల నుంచి చర్చలైతే నడుస్తున్నాయి.
Also Read: ఇండస్ట్రీ ని సాధించాల్సిన ఎన్టీఆర్ ఆ ఒక్క సినిమాతో పాతాళానికి పడిపోయాడా..?
మరి ఇదే విషయాన్ని రీసెంట్ గా వాళ్ళ తమ్ముడు అయిన శిరీష్ (Shirish) రామ్ చరణ్ మీద డైరెక్టర్ శంకర్ మీద కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. ఇక అప్పటి నుంచి మెగా అభిమానులతో పాటు మెగా హీరోలు కూడా ఇంతవరకు ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ విషయం మీద దిల్ రాజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికి మెగా హీరోలు మాత్రం దిల్ రాజు అతని తమ్ముడు మీద కొంతవరకు సీరియస్ గానే ఉన్నారు. మరి ఇకమీదట మెగా హీరోలు దిల్ రాజు కి డేట్స్ ఇచ్చే అవకాశాలు లేవా అనే రేంజ్ లో కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు దిల్ రాజు సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
దిల్ రాజు మీద ఇండస్ట్రీలో కొంతవరకు నెగెటివిటీ అయితే పెరుగుతూ పోతుంది. ఇక మెగా హీరోలు కూడా అతనికి వ్యతిరేకంగా మారే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోయే సినిమాలతో ఆయన సూపర్ సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…