Jr NTR Disaster Movie: కెరియర్ మొదట్లో వరుస సక్సెస్ లను సాధిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)… ఆయన చేసిన మొదటి సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నప్పటికి స్టూడెంట్ నెంబర్ వన్ (Student Number One) సినిమాతో సక్సెస్ బాట పట్టిన ఆయన ఆ తర్వాత వెను వెంటనే ఆది, సింహాద్రి లాంటి సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించి స్టార్ హీరోలతో పోటీపడ్డాడు. ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత అంతా గొప్ప గుర్తింపును సంపాదించుకునే హీరో కూడా ఎన్టీఆర్ అవుతాడు అంటూ చాలామంది చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయన టాప్ లో ఉన్నప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలకు అసలు సక్సెస్ లు కూడా లేవు. కానీ ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ కి ఫ్లాప్ ల వల్ల ఆయన వెనకబడాల్సి వచ్చింది. ఇక అదే క్రమంలో మహేష్ బాబు లాంటి హీరో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకురావడం వల్ల ఎన్టీఆర్ కంటే మహేష్ బాబుకి ఎక్కువ క్రేజ్ అయితే దక్కింది.
Also Read: ఓటీటీలో అద్భుతం చేస్తున్న పీరియాడిక్ సిరీస్, పదుల సంఖ్యలో అవార్డులు, డోంట్ మిస్!
ఇక ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేసిన కూడా ఒక సినిమా వల్ల ఆయన కెరీర్ అనేది పాతాళానికి పడిపోయింది. ఆ ఒక్క సినిమా కనుక చేయకపోయి ఉంటే ఆయన అప్పట్లోనే టాప్ పొజిషన్ ను అందుకునేవాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి… బి.గోపాల్ (B Gopal) దర్శకత్వంలో చేసిన నరసింహుడు(Narasimhudu) సినిమాతో ఆయన భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు.
ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకు ప్రొడ్యూసర్ ట్యాంక్ బండ్లో దూకి సూసైడ్ చేసుకునేదాకా వెళ్ళింది అంటే ఆ సినిమా చేసిన నష్టం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకానొక సందర్భంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లను సైతం బీట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ టాప్ పొజిషన్ కి వెళ్తాడు అని అందరూ అనుకున్నారు.
Also Read: సీనియర్ ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలను పోషించాలంటే ఆ స్టార్ హీరో వల్లే అవుతుందా..?
కానీ ఆయనకు వరుసగా ఇలాంటి డిజాస్టర్లు రావడంతో ఆయన కెరియర్ డైలమాలో పడిపోయిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత కాలంలో కూడా ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకురాకపోవడంతో ఆయన టాప్ హీరోల్లో ఒకరిగానే ఉన్నాడు తప్ప నెంబర్ వన్ పొజిషన్ ని అందుకోలేకపోయాడు…