Rajamouli: దర్శక ధీరుడు గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న రాజమౌళి ఆయన ఎంటైర్ కెరియర్ లో తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక ఇప్పటివరకు ఫ్లాప్ అనేది ఎరుగని ఈ దర్శకుడు తన మొదటి సినిమా అయిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా నుంచి ‘త్రిబుల్ ఆర్’ సినిమా వరకు అన్ని సక్సెస్ లను సాధిస్తూ వచ్చాడు. ఇక ఇందులో కొన్ని ఇండస్ట్రీ హిట్లు ఉంటే, మరి కొన్ని బ్లాక్ బాస్టర్ సక్సెస్ లు ఉన్నాయి.
ఇక మొత్తానికైతే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే పాన్ ఇండియాలో తెలుగు సినిమా సత్తా ఏంటో చాటిన రాజమౌళి ఇప్పుడు వరల్డ్ లో తెలుగు సినిమా స్టామినా ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా రాజమౌళి తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను కూడా సెట్స్ మీద తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు రాజమౌళి సాధించిన ప్రతి సక్సెస్ కి కారణం ఏంటి అనే విషయం మీద సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అది ఏంటి అంటే రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ముందు రోజు తన మైండ్ లో సినిమాకు సంబంధించిన ఎలాంటి ఆలోచనలు పెట్టుకోడట.
తను ప్రశాంతంగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి పొద్దున్నే దేవుళ్ళకి పూజ చేసుకొని షూటింగ్ స్పాట్ కి వెళ్తారట. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అనేదాని గురించి ఆలోచిస్తూ ఏ షాట్ ఎప్పుడు తీయాలి, ఎలా తీయాలి అనేది కూడా తన మైండ్ లో డిసైడ్ అవుతూ ఉంటారట. అందువల్లే ఆయన షూటింగ్ చేసేటప్పుడు ఆయనకు ఏ కన్ఫ్యూజన్సు లేకుండా చాలా క్లారిటీగా ముందుకు సాగుతూ ఉంటారట.
అలా కాకుండా నైట్ అంతా స్క్రిప్ట్ తో కుస్తీ పట్టి నిద్ర లేకుండా షూటింగ్ స్పాట్ కొచ్చి ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యే మెంటాలిటీ తనకు లేదని తన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు తను అలాంటి స్ట్రాటజీనే మైంటైన్ చేస్తూ వస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది…ఇక మొత్తానికైతే ఇప్పుడు రాజమౌళి పాన్ వరల్డ్ లో తన సత్తా చాటాడానికి రెడీ అవుతున్నాడు…