Homeఎంటర్టైన్మెంట్Vishnu Vinyasam First Day Collections: 'విష్ణు విన్యాసం' మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంత గ్రాస్...

Vishnu Vinyasam First Day Collections: ‘విష్ణు విన్యాసం’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంత గ్రాస్ అసలు ఊహించలేదు!

Vishnu Vinyasam First Day Collections: శ్రీ విష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ శ్రీ విష్ణు కి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ కారణంగా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి మొదటి రోజున 40 వేలకు పైగా […]

Vishnu Vinyasam First Day Collections: శ్రీ విష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ శ్రీ విష్ణు కి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ కారణంగా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి మొదటి రోజున 40 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా రెండవ రోజు కూడా ఈ చిత్రానికి నూన్ షోస్ నుండే డీసెంట్ స్థాయి ఆక్యుపెన్సీలు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 3 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. మొదటి రోజు కూడా ఈ రేంజ్ ట్రెండ్ లేకపోవడం గమనార్హం.

దీనిని బట్టీ చూస్తే ఆడియన్స్ మినిమం యావరేజ్ సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురు చూసారో అర్థం అవుతోందో. మొదటి రోజు ఈ చిత్రానికి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , తెలుగు రాష్ట్రాల నుండి దాదాపుగా 1 కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి లక్షకు పైగా డాలర్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఈమధ్య కాలం లో స్టార్ హీరోలకు కూడా టికెట్స్ న కొనడానికి ఓవర్సీస్ ఆడియన్స్ ఆలోచిస్తున్నారు. అలాంటిది శ్రీ విష్ణు లాంటి మీడియం రేంజ్ హీరో కి కళ్ళు మూసుకొని లక్ష డాలర్ల రేంజ్ లో గ్రాస్ ఇచ్చారంటే సాధారణమైన విషయం కాదు. షేర్ వసూళ్లు దాదాపుగా 50 లక్షల వరకు ఉంటుంది.

Also Read: రజినీకాంత్ – కమల్ హాసన్ మూవీలో క్యామియో రోల్స్ లో నటిస్తున్న పాన్ ఇండియా స్టార్ హీరోలు..

మొత్తం మీద ఈ చిత్రానికి మొదటి రోజున వరల్డ్ వైడ్ గా మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, కోటి 50 లక్షలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజున మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లు రావొచ్చు. కచ్చితంగా రెండవ రోజున రెండు కోట్ల రూపాయలకు పైగానే షేర్ ఉండొచ్చని అంటుకుంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ఓవరాల్ గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయ్. టాక్ కాస్త డివైడ్ గా వచ్చినా, శ్రీవిష్ణు మీద నమ్మకంతో జనాలు థియేటర్స్ కి కదులుతున్నారు. రాబోయే రోజుల్లో ee చిత్రం వసూళ్ల పరంగా ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper