https://oktelugu.com/

Vaishnav Tej: బుల్లితెరపై సత్తాచాటిన మెగా హీరో..!

Vaishnav Tej: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెల్సిందే. వైష్ణవ్ తేజ్ తన తొలి మూవీతోనే 100కోట్ల హీరోగా అవతరించాడు. ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ కు జోడిగా కృతిశెట్టి(బేబమ్మ) నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, గాయత్రి జయరాం ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు సుకుమార్ ప్రియశిష్యుడు బుచ్చిబాబు సానా ‘ఉప్పెన’ మూవీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 8, 2022 / 03:39 PM IST
    Follow us on

    Vaishnav Tej: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెల్సిందే. వైష్ణవ్ తేజ్ తన తొలి మూవీతోనే 100కోట్ల హీరోగా అవతరించాడు. ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ కు జోడిగా కృతిశెట్టి(బేబమ్మ) నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, గాయత్రి జయరాం ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించారు.

    దర్శకుడు సుకుమార్ ప్రియశిష్యుడు బుచ్చిబాబు సానా ‘ఉప్పెన’ మూవీ అద్భుతంగా తెరకెక్కించాడు. బుచ్చిబాబు తన తొలి మూవీతోనే డైరెక్టర్ గా భారీ హిట్టందుకున్నాడు. వైష్ణవ్ తేజ్ చిరంజీవి మేనల్లుడు కావడంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టి అతడి గ్రాండ్ గా టాలీవుడ్ కు పరిచయం చేసింది. ఈ మూవీ భారీ  విజయంతో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లో బీజీగా స్టార్ గా మారిపోయాడు.

    ‘ఉప్పెన’ తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన చిత్రం ‘కొండపొలం’, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ‘కొండపొలం’ నవల ఆధారంగా తీశారు. ఈ మూవీలో వైష్ణవ్ కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. గతేడాది అక్టోబర్్ 8న దసరా కానుకగా ‘కొండపొలం’ థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం విజయం అందుకోలేక పోయింది.

    ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కొండపొలం’ మూవీ తాజాగా స్టార్ మాలో ప్రసారమైంది. బుల్లితెరపై ఈ సినిమా అత్యధిక టీఆర్పీని దక్కించుకుంది. అర్బన్ ఏరియాల్లో ఈ సినిమాకు 12.43 టీఆర్పీ వచ్చింది. రూరల్, అర్బన్ రెండు కలిపి ఈ మూవీ ఓవరాల్ గా 10.54 టీఆర్పీని వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఆడిన ఈ మూవీ బుల్లితెరపై మాత్రం భారీ టీఆర్పీ దక్కించుకోవడం విశేషం.