Chandrababu: అవకాశం కోసం ఎదురు చూడటం కాదు.. సందర్భాన్ని బట్టి అవకాశాలను సృష్టించుకోవడంలో చంద్రబాబు దిట్ట. ఆయన రాజకీయ జీవితంలో ఎక్కువగా ఇలాంటివే పాటించి సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఏపీలో ఉద్యోగ సంఘాల రగడ తర్వాత.. ఆయనలో మరో ఆలోచన మెదలినట్టు తెలుస్తోంది. దీన్ని కార్యరూపం దాల్చేలా చేసేందుకు ఇప్పటికే సీనియర్ నేతలను రంగంలోకి దించినట్టు సమాచారం. వారితో ఆయన భేటీ అయ్యారంట.
మొన్న ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమం తీసుకుంటే.. ప్రజల నుంచి పెద్ద ఎత్తున సపోర్టు వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నినదించారు. కాబట్టి ఇలాంటి ఉద్యమమే చేసి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక భావన తీసుకురావాలని అనుకుంటున్నారంట. ఇందుకోసం టీడీపీ మాత్రమే కాకుండా కలిసి వచ్చే అఖిల పక్ష పార్టీలను కూడా కలుపుకుని పోవాలని భావిస్తున్నారంట. అలా అయితే ఆటోమేటిక్ గా జగన్‌కు షాక్ ఇవ్వొచ్చని చంద్రబాబు ప్లాన్.
ఇందుకోసం ఇప్పటి నుంచి అఖిల పక్ష కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఉద్యమాన్ని నమ్ముకుంటే తప్ప.. రాబోయే రెండేళ్లలో జగన్ మీద వ్యతిరేకత తీసుకు రావడం కష్టమని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అయితే జగన్ పాలనలో సంక్షేమ పథకాలు తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదనేది కాదనలేని వాస్తవం. కాబట్టి దీన్ని ఎజెండాగా తీసుకుని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నది చంద్రబాబు ఆలోచన.
Also Read: Jagan-Chandrababu: జగన్ ఫార్ములాను వాడేస్తున్న చంద్రబాబు.. ఏపీ సీఎం ఇరకాటంలో పడుతారా..?
అయితే అఖిల పక్ష పార్టీలతో పొత్తు అనే మాటను కాకుండా.. కేవలం ఉద్యమ కూటమి అనే మాటను తెరమీదకు తీసుకు వచ్చి వారిని కలుపుకుని పోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారంట. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారితో త్వరలోనే సమావేశం అవుతారని టీడీపీలో చర్చ సాగుతోంది. ఇది పొలిటికల్ కార్యక్రమం కాదు కాబట్టి.. ప్రజల తరఫున పోరాడేందుకు వామపక్షాలు ఆయనతో కలిసి వస్తాయన్నది చంద్రబాబు ప్లాన్.
ముందుగా వామపక్షాలను కలుపుకుని పోతే.. ఆటోమేటిక్ గా జనసేన కూడా ఈ కూటమిలో చేరుతుందని ఆయన అనుకుంటున్నారంట. ఒకవేళ బాబు ప్లాన్ సక్సెస్ అయితే మాత్రం జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడ్డట్టే. పైగా ఇప్పటికే సోషల్ మీడియాలో వైసీపీ పాలన మీద ట్రోల్స్ బాగానే నడుస్తున్నాయి. మరి బాబు ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Also Read: Chandrababu: సొంత సామాజికవర్గమే చంద్రబాబును తిడుతోందా? కారణమేంటి?