https://oktelugu.com/

Vikram Vedha: విక్రమ్ వేద సినిమాను రీమేక్ చేయనున్న తెలుగు స్టార్ హీరోలు…

చాలా రోజుల నుంచి ఒక సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఆ సినిమా ఏంటి అంటే విక్రమ్ వేద..ఈ సినిమాలో మాధవన్, విజయ్ సేతుపతి ఇద్దరు కలిసి నటించారు.

Written By: , Updated On : March 28, 2024 / 07:37 AM IST
Vikram Vedha

Vikram Vedha

Follow us on

Vikram Vedha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలలో సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలు మొదటి స్థానంలో ఉంటారు. ప్రస్తుతం వీళ్లు చేస్తున్న సినిమాలు కూడా మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ మిగతా హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలను చేస్తుంటే వేరే హీరోలందరూ సోలోగా సినిమాని చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే చాలా రోజుల నుంచి ఒక సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఆ సినిమా ఏంటి అంటే విక్రమ్ వేద..ఈ సినిమాలో మాధవన్, విజయ్ సేతుపతి ఇద్దరు కలిసి నటించారు. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే రవితేజ, వెంకటేష్ లను హీరోలుగా పెట్టి ఈ సినిమాని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్త లైతే వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందో తెలియట్లేదు.

కానీ మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక విక్రమ్ వేద సినిమాకి రీమేక్ కావడం వల్ల వీళ్ళ కాంబినేషన్ మీద ఆటోమేటిగ్గా ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా మీద చాలా రోజుల నుంచి రూమర్లు అయితే వస్తున్నాయి. కానీ దాని మీద ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.

ఇక ఈ సినిమాని సురేష్ బాబు తమ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనిని హరీష్ శంకర్ కి అప్పజెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన కూడా ఈ స్క్రిప్ట్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్టు గా మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుంది అనేది…