Tillu Square Trailer: టిల్లు స్క్వేర్ ట్రైలర్ రివ్యూ: ఈ జంబల్ హాట్ లేడీస్ ని ఎక్కడ పడతావ్ రా? టిల్లు గాడి వీర విహారం!

ఎప్పటిలాగే సిద్దూ జొన్నలగడ్డ ఎనర్జీ, కామెడీ టైమింగ్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి. అనుపమ గ్లామరస్ అవతార్ మెస్మరైజ్ చేసింది. సెకండ్ ట్రైలర్ మరింత ఆకట్టుకోగా టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరిగాయి.

Written By: S Reddy, Updated On : March 28, 2024 7:44 am

Tillu Square Trailer

Follow us on

Tillu Square Trailer: హీరో సిద్దూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. నిర్మాతలకు మంచి లాభాలు పంచింది. కామెడీ, రొమాన్స్, క్రైమ్ అంశాలు కలగలిపి డీజే టిల్లు తెరకెక్కింది. హీరోయిన్ గా నేహా శెట్టి నటించింది. డీజే టిల్లు సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కించారు. ఈ చిత్రం మార్చి 29న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా టిల్లు స్క్వేర్ నుండి మరో ట్రైలర్ విడుదల చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివి కలిగిన టిల్లు స్క్వేర్ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేసింది.

ఎప్పటిలాగే సిద్దూ జొన్నలగడ్డ ఎనర్జీ, కామెడీ టైమింగ్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి. అనుపమ గ్లామరస్ అవతార్ మెస్మరైజ్ చేసింది. సెకండ్ ట్రైలర్ మరింత ఆకట్టుకోగా టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరిగాయి. టిల్లు స్క్వేర్ చిత్రంలో అనుపమ గ్లామరస్ రోల్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముద్దు సన్నివేశాల్లో నటించింది. ప్రమోషన్స్ లో అనుపమకు ఇదే విషయం మీద ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

నేను కెరీర్ బిగినింగ్ నుండి హోమ్లీ హీరోయిన్ రోల్స్ చేశాను. ఎప్పుడూ అవే చేస్తుంటే బోర్ కొట్టేస్తుంది. అందుకే పంథా మార్చాను. టిల్లు స్క్వేర్ చిత్రంలో చేసిన లిల్లీ వంటి పాత్రలు చాలా అరుదుగా దొరుకుతాయి. లిల్లీ పాత్ర రిజెక్ట్ చేస్తే అంతకంటే అమాయకత్వం ఉండదు. దర్శకుడు రాసిన పాత్రకు పూర్తిగా న్యాయం చేసే ప్రయత్నం చేశాను, అని అనుపమ అన్నారు. అలాగే కెమెరాల ముందు రొమాన్స్ చేయడం అంత ఈజీ కాదని ఆమె వెల్లడించారు.

టిల్లు స్క్వేర్ మూవీలో ధరించిన బట్టలు నిజ జీవితంలో ఎన్నడూ ధరించలేదు అన్నారు. మొత్తంగా టిల్లు స్క్వేర్ కోసం అనుపమ చాలా సాహసాలే చేసింది. ఆమె శ్రమకు, తెగింపుకు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. టిల్లు స్క్వేర్ చిత్రానికి మాలిక్ రామ్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. మరికొన్ని గంటల్లో టిల్లు స్క్వేర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్ లో హైప్ ఉన్న నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం కలదు.