
Mahesh Koneru: సినిమా నిర్మాత మహేష్ కోనేరు జీవితం కూడా ఓ మిస్టరీ సినిమాలా మారిపోయింది. గుండెపోటుతో మహేష్ కోనేరు మరణించాడనే వార్త వచ్చిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. కానీ ఆయనకు అప్పులు ఇచ్చిన వాళ్ళు మాత్రం భయంతో వణికిపోయారు. ఒక సాధారణ జర్నలిస్ట్ ఒక నిర్మాతగా ఎలా ఎదిగాడు ? అసలు అతని నేపథ్యం ఏమిటి ? ఇలా అనేక ప్రశ్నలు మహేష్ కోనేరు చుట్టూ తిరుగుతూ ఉండేవి.
ఇప్పుడు ఆ ప్రశ్నలను మించిన ప్రశ్నలు సినిమా వాళ్ళను, జర్నలిస్ట్ లను ఇబ్బంది పెడుతున్నాయి. మహేష్ కోనేరు కంటెంట్ రైటర్ గా జీవితాన్ని మొదలుపెట్టి.. దర్శకుడు రాజమౌళితో పరిచయం పెంచుకుని.. ఆ కుటుంబానికి బాగా దగ్గర అయ్యాడు. దాంతో రాజమౌళి మహేష్ కోనేరును పీఆర్వో గా ప్రమోట్ చేశాడు. తన ‘బాహుబలి’ సినిమాకు పీఆర్వోగా నియమించుకున్నాడు.
ఏకంగా ‘బాహుబలి’కి పీఆర్వో అనే పేరు వచ్చాక, పీఆర్వోగా వరుస సినిమాలు వచ్చాయి. కానీ మహేష్ మాత్రం తన కెరీర్ ను మరోలా ప్లాన్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ దగ్గర మేనేజర్ గా జాయిన్ అయ్యాడు. అలా కళ్యాణ్ రామ్ కి – ఎన్టీఆర్ ఫ్యామిలీకి బాగా సన్నిహితుడు అయ్యాడు. ఆ సన్నిహిత్యం కారణంగా కళ్యాణ్ రామ్ డేట్ లు ఇచ్చాడు.
అలా మహేష్ కోనేరు నిర్మాతగా మారాడు. ఆ తర్వాత కూడా 118, తిమ్మరసు, మిస్ ఇండియా వంటి చిత్రాలు నిర్మించాడు. కట్ చేస్తే.. మహేష్ కోనేరు ఇక లేరు. కరెక్ట్ గా ఇక్కడే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మహేష్ కోనేరుకి దాదాపు 70 కోట్ల అప్పులు ఉన్నాయట. ఆ టెన్షన్ కారణంగానే మహేష్ కోనేరుకి గుండెపోటు వచ్చింది అంటున్నారు.
ఇండస్ట్రీలో మహేష్ కోనేరుకి మంచి పేరు ఉంది. పైగా సంస్కారవంతమైన మనిషి, నిజాయితీ గల మనిషి అని పేరు ఉంది. అందుకే మహేష్ కోనేరు అడగానే అందరూ అప్పులు ఇచ్చారు. ఇప్పుడు ఆ అప్పులు ఇచ్చిన వారి లిస్ట్ లో ఫైనాన్సియర్లు, నిర్మాతల దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్లు, జర్నలిస్ట్ ల వరకూ చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా 70 కోట్ల మేరకు అప్పులు చేసి మహేష్ కోనేరు చనిపోవడం షాకింగ్ పాయింటే.