Mohan Babu and Chiranjeevi: ‘మా’ ఎన్నికల్లో ఓడిపోయింది, బాధ పడింది ప్రకాష్ రాజ్ కాదు. ప్రకాష్ రాజ్ కి వత్తాసు పలికి అతన్ని గెలిపించడానికి నానాపాట్లు పడిన మెగా ఫ్యామిలీ అని సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేసథ్యంలో తలెత్తిన ఎన్నో విభేదాలు.. వాటి కారణంగా “మా” అసోసియేషన్ వివాదాల కేంద్ర బిందువు అయింది. దీనికితోడు మంచు ఫ్యామిలీ – మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరిగిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి నేరుగా మోహన్ బాబుకు ఫోన్ చేసారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటేనే విలక్షణత్వం.. మెగాస్టార్ అంటేనే మంచితనం. ఒకరు ఆవేశానికి ప్రతి రూపం, మరొకరు ఆలోచనకు పర్యాయపదం. అందుకే, ఇద్దరి మధ్య ఎన్నో సార్లు అభిప్రాయబేధాలు వచ్చినా.. మళ్ళీ కలిసిపోయారు.
తాజాగా ఈ ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక పరిణామాల పై ఇద్దరూ చర్చించుకున్నారు. అయితే, చిరు మోహన్ బాబుతో అకారణంగా తన పేరు ప్రచారం చేసారని.. అంతే తప్ప, తాను ఎవరికీ మద్దతు ఇవ్వలేదని చిరంజీవి చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ చిరంజీవి నిజంగానే ఇదే గనుక చెబితే.. నాగబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇక చిరంజీవి ఏం చెప్పినా.. మోహన్ బాబు మాత్రం చిరును ఆప్యాయంగా పలకరించారు. చిరు చెప్పిన ప్రతి విషయం పై సానుకూలంగా స్పందించారు. జరిగిపోయిందేదో జరిగిపోయిందని..అందరం కలసికట్టుగా ఉండాలని మోహన్ బాబు – చిరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ మొదటి నుంచి అందరం ఒక తల్లి బిడ్డలుగా కలిసి ఉందాం అని చెబుతూ వస్తున్నారు.
Also Read: Ram Charan: నాన్న నట వారసత్వాన్నే కాదు సేవా తత్వాన్ని కూడా తీసుకుంటున్నా: రామ్ చరణ్
ఇక త్వరలోనే మోహన్ బాబు, చిరంజీవి ముఖాముఖి కలుసుకే అవకాశం ఉంది. మొత్తానికి ఈ ఫోన్ కాల్ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. పైగా మోహన్ బాబు – చిరంజీవి ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారని, కీలక అంశాలపై చర్చించారని.. ‘మా’ నూతన అధ్యక్షుడు విష్ణు కూడా నిర్ధారించడం విశేషం.
Also Read: Manchu Lakshmi: ఈ మంచు లక్ష్మి మళ్లీ పవన్ కళ్యాణ్ ను కలిపేసుకుందే !