CM Jagan: అధికారంలో ఉన్న వారికి భక్తి ఎక్కువగానే ఉంటుంది. వారు ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఉన్న ఆలయాలను సందర్శించి స్వామీజీలను కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం పరిపాటే. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ది ప్రత్యేకమైన శైలి. ఎక్కడికి కూడా ఎక్కువగా వెళ్లని ఆయన ఈ మధ్య భక్తిభావంతో ఊగిపోతున్నారు. పలు ఆశ్రమాలు సందర్శిస్తూ తనలోని భక్తి భావాన్ని చాటుతున్నారు. గతంలో విశాఖ శారదా పీఠాన్ని పలు మార్లు సందర్శించి స్వామీజీల ఆశీర్వాదం తీసుకుంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో విజయవాడలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించాలని భావిస్తున్నారు.

ఆశ్రమాల నిర్వాహకులు పిలిస్తే వెళ్లి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొని రావడం తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు మార్లు పలు చోట్లకు వెళ్లి రావడం చూశాం. కానీ విజయవాడలోని దత్తనగర్ లోని ఆశ్రమానికి ఎప్పుడూ వెళ్లని జగన్ ఈసారి అక్కడికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. అక్కడి ఆలయాలను సందర్శించి మరకత రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామీజీలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ పర్యటనపై వైసీపీలోని నేతలకు కూడా తెలియడం లేదు. అందులో ఉన్న అంతరార్థం కూడా అంతుచిక్కడం లేదు. జగన్ నిర్ణయంలో ఉన్న నిగూర్థాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఆయన నైజం ఏమిటన్నది ఎవరికి అర్థం కావడం లేదు. ఉత్సవాలు జరిగినప్పుడు వెళ్లడం సహజమే. కానీ ఏ కార్యక్రమం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా ఆశ్రమానికి వెళ్లి అక్కడ గడపడంలోనే ఏం దాగుందనే దానిపై అందరు తర్జనభర్జన పడుతున్నారు.
Also Read: Kesineni Nani: పార్టీని వీడేందుకు కేశినేని నాని సిద్ధమేనా?
ఈ మధ్య భక్తి అంటే జగన్ ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతోనే ఆయన పలు మార్గాలు అనుసరిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆశ్రమాలు సందర్శించి అక్కడ స్వామీజీల ఆశీస్సులు తీసుకుంటున్నరని చెబుతున్నారు. ఏదిఏమైనా పార్టీని గాడిలో పెట్టే పనిలో భాగంగా వైసీపీని మరోసారి అధికారంలో నిలబెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Also Read: Rayalaseema water issues: సీమ నీటి ఫైట్.. జగన్, మోడీని ఢీకొంటారా?