https://oktelugu.com/

Pushpa 2 Teaser: ఎన్టీఆర్ రికార్డు లేపేసిన బన్నీ… ఇది మామూలు అరాచకం కాదు!

పుష్ప 2 టీజర్ ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అయ్యింది. గతంలో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ టీజర్ 137 గంటలు టాప్ లో ట్రెండ్ అయ్యింది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 14, 2024 / 03:09 PM IST

    Pushpa 2 Teaser

    Follow us on

    Pushpa 2 Teaser: హీరో అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో టాలీవుడ్ రికార్డ్స్ మొత్తం లేపేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ రేంజ్ లో పుష్ప 2 మీద హైప్ ఉంది. తాజాగా విడుదలైన పుష్ప 2 ప్రోమో అనేక మైలురాళ్లు చేరుకుంది. ఈ టీజర్ తో ఎన్టీఆర్ పేరిట ఉన్న ఊరు రికార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కాగా… టీజర్ విడుదల చేశారు. జాతరలో అమ్మవారి గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ మేనరిజం, ఫైట్స్ టీజర్ కి హైలెట్ గా నిలిచాయి. టీజర్ లో కనీసం ఓ డైలాగ్ కూడా లేదు. అయినప్పటికీ పుష్ప 2 టీజర్ ఆకర్షించింది.

    కాగా పుష్ప 2 టీజర్ ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అయ్యింది. గతంలో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ టీజర్ 137 గంటలు టాప్ లో ట్రెండ్ అయ్యింది. ఆ రికార్డును పుష్ప 2 టీజర్ బద్దలు కొట్టింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా పుష్ప 2… 2021లో విడుదలైన పుష్ప చిత్రానికి సీక్వెల్. మొదటి భాగంలో అల్లు అర్జున్ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ వద్ద పని చేసే కూలీగా కనిపించాడు. పార్ట్ 2 లో తానే సిండికేట్ డాన్ గా కనిపించనున్నాడు.

    మెయిన్ విలన్ రోల్ చేసిన ఫహద్ ఫాజిల్ కేవలం క్లైమాక్స్ లో కొన్ని సన్నివేశాలలో మాత్రమే కనిపించాడు. పుష్ప 2లో ప్రధాన సంఘర్షణ అల్లు అర్జున్-ఫహద్ ఫాజిల్ మధ్య సాగనుంది. ఇక నార్త్ ఇండియాలో పుష్ప 2 కోసం ఆడియన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేవలం హిందీ వర్షన్ రూ. 500 కోట్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. కేవలం నైజాం హక్కులు రూ. 100 కోట్ల వరకు పలుకుతున్నాయట. ఆర్ ఆర్ ఆర్, సలార్ సైతం ఈ స్థాయిలో అమ్ముడు పోలేదు.

    మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. అనసూయ, సునీల్, రావు రమేష్ కీలక రోల్స్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండగా శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.