Kalki 2898 AD: ఏడేళ్ల తర్వాత నెగెటివిటీ లేకుండా ప్రభాస్ సినిమా!

అప్పట్లో టాలీవుడ్ మూస ధోరణిలో సాగుతున్నవేళ ఆర్జీవీ శివ తీసి గతిని పూర్తిగా మార్చాడు. ఆ తర్వాత చాలా ఏళ్లకు దర్శక ధీరుడు రాజమళి బాహుబలి తీసి టాలీవుడ్ ను మరో అందలం ఎక్కించాడు.

Written By: Neelambaram, Updated On : June 27, 2024 5:35 pm

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: టాలీవుడ్ చిత్ర సీమ పూర్తిగా మారిపోయింది. గతంలో ఇతర ఇండస్ట్రీల నుంచి హీరోలు, హీరోయిన్లను అరువు తెచ్చుకునే వారం కానీ నేడు టాలీవుడ్ హీరోలకే హాలీవుడ్ నుంచి పిలుపు వస్తుంది. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చిన సందర్భంలో ఒక హాలీవుడ్ డైరెక్టర్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఆశగా ఉందని చెప్పడం నిజంగా గర్వించదగిన విషయమే. అయితే ఆ గుర్తింపు అంత ఊరికే రాలేదు. ఎంతో మంది డైరెక్టర్లు, మరెంతో మంది హీరోలు ఎన్నో సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితమే నేడు ఇండస్ట్రీ వరల్డ్ వైడ్ గా గుర్తింపు దక్కించుకుంది.

అప్పట్లో టాలీవుడ్ మూస ధోరణిలో సాగుతున్నవేళ ఆర్జీవీ శివ తీసి గతిని పూర్తిగా మార్చాడు. ఆ తర్వాత చాలా ఏళ్లకు దర్శక ధీరుడు రాజమళి బాహుబలి తీసి టాలీవుడ్ ను మరో అందలం ఎక్కించాడు. ‘బాహుబలి’ క్రెడిట్ మొత్తం ప్రభాస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఎందుకంటే ప్రభాస్ కటౌట్. ఈ కటౌట్ ను చూసిన దర్శకులు, ఫ్యాన్స్ మెస్మరైజ్ కాక తప్పదు. అందుకే బాహుబలి మొత్తం ప్రభాస్ చుట్టూనే తిరిగింది.

బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలు డిజాస్టర్లను ఎదుర్కొన్నాయి. అందులో సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఉండగా. ఇవి కేవలం ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ తోనే నిర్మాతలను అప్పుల ఊబినుంచి బయటకు పడేశాయి. కానీ సినిమాలు మాత్రం డిజాస్టర్ గా మిగిలాయి. ఇక ఇటీవల వచ్చిన సలార్ ప్రభాస్ ను మళ్లీ పట్టాలెక్కించింది.

గురువారం (జూన్ 27) రిలీజైన ‘కల్కి 2898 ఏడీ’లో భైరవగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. కల్కి మేకర్స్ కట్ చేసిన రెండు ట్రైలర్స్ విపరీతమైన వ్యూవ్స్ తో దూసుకుపోయాయి. దీన్ని అంచనా వేసిన టాలీవుడ్ వర్గాలు సినిమా హిట్ అంటూ కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. అనుకున్నట్లుగానే స్పెషల్ షో నుంచే విపరీతమైన పాజిటివ్ టాక్ తో సినిమా దూసుకుపోతోంది. దీంతో సోషల్ మీడియాలో ఒక చర్చ జోరందుకుంది. అందేంటంటే ‘చాలా ఏళ్లకు ప్రభాస్ సినిమా ఎలాంటి నెగిటివ్ టాక్ లేకుండా దూసుకుపోతోందని’.

బాహుబలి సిరీస్ ముగిసిన తర్వాత ప్రభాస్ ‘సాహో’కు కమిట్ అయ్యాడు. ఇది అత్యంత భారీ బడ్జెట్ తో, ఫుల్ వీఎఫ్ఎక్స్ తో వచ్చింది. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నా.. ఆశించినంత బాక్సాఫీస్ మత్రం దక్కించుకోలేదు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఆడియన్స్ కు నచ్చలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇక ఆ తర్వాత ‘రాధే శ్యామ్’ ఈ సినిమాకు ఆది నుంచి కష్టాలు మొదలయ్యాయి. హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే మధ్య వార్ కొనసాగిందని, అందుకే షూటింగ్ సరిగ్గా జరగలేదని వార్తలు బయటకు వచ్చాయి. ఇక దీని చుట్టూ రూమర్లు వినిపించాయి. సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది.

ఇక ‘ఆదిపురుష్’ విషయంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫస్ట్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి సినిమా థియేటర్ల నుంచి ఓటీటీలోకి వచ్చే వరకు ట్రోల్స్, విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. గ్రాఫిక్స్ సెట్ కాలేదు, రావణాసురుడి మేకప్, వానరాలను చూపెట్టడం ఇలా ప్రతీ ఒక్కటీ విమర్శలకు గురైంది. ఓం రౌత్ ఈ సినిమాతో చాలా నిరాశకు గురయ్యాడు.

ఇక గతేడాది రిలీజైన ‘సలార్’ ఇందులో కూడా ప్రభాస్ కు ఎక్కువ డైలాగులు ఇవ్వలేదని మొదట్లో వాదనలు నడిచినా తర్వాత సర్దుకున్నాయి. రిలీజ్ డేట్లను తరుచుగా మార్చడం కూడా సినిమాపై ప్రభావం పడింది. మేకర్స్ పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడం వల్ల మూవీపై పాజిటివ్ బజ్ క్రియేటైంది.

వీటన్నింటినీ పరిశీలిస్తే ఏడు సంవత్సరాల కింద వచ్చిన బాహుబలి 2 (2017) తర్వాత ఇప్పుడు వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ఎలాంటి నెగిటివిటీ లేకుండా వచ్చింది. ప్రతీ ఒక్క అంశంలో ప్రభాస్ ను సెంటర్ ఆఫ్ మూవీగా తీసుకుంటే ఎలాంటి కామెంట్స్ గానీ, ట్రోల్స్ గానీ లేకుండా వచ్చింది. కల్కి ప్రభాస్ కెరీర్ లో మరో భారీ బిగ్గెస్ట్ హిట్ అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు.