NRI News : అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి వ్యక్తులపై దాడులు కొనసాగుతున్నాయి. వరుస దాడులతో ఇప్పటికే భారత సంతతి వ్యక్తులు, విద్యార్థులు అమెరికాలో జరిపిన వేర్వేరు దాడులు, కాల్పుల్లో మృత్యువాత పడ్డారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన యువకుడు ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన దాడిలో మరో భారత సంతతి వ్యక్తి మృతిచెందాడు.
గుజరాత్ వాసిగా గుర్తింపు…
గుజరాత్‌కు చెందిన హేమంత్ మిశ్రా ఓక్లహోమా రాష్ట్రంలోని ఓ హోట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. జూన్ 22 రాత్రి 10 గంటల సమయంలో హోటల్ నుంచి వెళ్లిపోవాలని రిచర్డ్ లూయిస్ అనే వ్యక్తిని హేమంత్ కోరాడు. దీంతో అతను కోపంతో మిశ్రా ముఖంపై దాడిచేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హేమంత్ మిశ్రాను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అతను మృతిచెందాడు.
నిందితుడి అరెస్ట్…
తాజా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. హోటల్‌లోనే దాక్కున్న రిచర్డ్ లూయిస్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడికి దారితీసిన పరిస్థితులు, మిశ్రాపై జరిగిన దాడికి కారణాలను ఆరా తీస్తున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఓక్లహోమా పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
యూఎస్‌లో ఇండియన్స్‌పై ఆగని దాడులు.. అమెరికన్ దాడిలో భారతీయుడి మృతి
గుజరాత్‌కు చెందిన హేమంత్ శాంతీలాల్ మిస్త్రీ (59) ఓక్లహోమాలో స్థిరపడి ఓ హోటల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.. ఆ హోటల్ పార్కింగ్ స్థలంలో నిందితుడు లీవీస్ తన వస్తువులు పెట్టగా హేమంత్ ఖాళీ చేయమన్నాడు.
అక్కడ వాగ్వాదం… pic.twitter.com/tPfH8UMpe3
— Telugu Scribe (@TeluguScribe) June 26, 2024