https://oktelugu.com/

Kalki 2898 AD USA Review: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ మూవీ యూఎస్ఏ రివ్యూ…

అమితాబచ్చన్ కమలహాసన్ ఈ సినిమాని వాళ్ల భుజాల మీద మోసుకెళ్లినట్టుగా కూడా చెబుతున్నారు. ప్రభాస్ ఒక్కడు ఒకవైపు నిల్చుంటే వీళ్ళిద్దరూ రెండు పిల్లర్స్ లా నిలబడి సినిమాని సూపర్ సక్సెస్ చేసినట్టుగా కూడా తెలియజేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 26, 2024 / 08:10 AM IST

    Kalki 2898 AD USA Review

    Follow us on

    Kalki 2898 AD USA Review: బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్… ప్రస్తుతం కల్కి సినిమాతో మరోసారి భారీ వసూళ్లను సాధించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక చాలా రోజుల నుంచి కల్కి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రతి అభిమానికి ఈ సినిమా విజువల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయింది. అయితే మన దగ్గర ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ పడడానికి మరికొద్ది గంటలు సమయం ఉన్నప్పటికీ యుఎస్ఎ లో మాత్రం ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ని వేశారు. ఇక అక్కడ ఈ సినిమాను చూసిన ప్రభాస్ అభిమానులు ఈ సినిమా గురించి ఏం చెబుతున్నారు. తమ అభిమాన హీరోను ఎలాగైతే చూడాలి అనుకున్నారో అలాంటి క్యారెక్టర్ లో కనిపించాడా? వాళ్లు సాటిస్ఫై అయ్యారా? లేదంటే ప్రభాస్ చేసిన పాత్ర పట్ల వాళ్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా? అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే మహాభారతంలోని క్యారెక్టర్ లను బేస్ చేసుకొని నాగ్ అశ్విన్ ఈ కథ రాసిన విషయం మనకు తెలిసిందే. అయితే పురాణాల్లో శ్రీమహావిష్ణువు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడైతే కలియుగంలో అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు విలయ తాండవం చేస్తాయో అప్పుడు కల్కి అవతారంలో శ్రీమహావిష్ణువు వచ్చి దుష్ఠులందరిని అంతం చేస్తాడనే ఒక విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో కూడా కలి అయిన కమలహాసన్ సృష్టి నాశానాన్ని కోరుతాడు. ఇక ఆయన చేసిన విపత్తులను భైరవ (ప్రభాస్), కల్కి ఇద్దరు కలిసి ఎలా ఆపారు అనేదే ఈ సినిమా కథగా చెబుతున్నారు. అయితే ఈ కథతో నాగ్ అశ్విన్ జనాలను మెప్పించాడా? లేదా అంటే ఈ సినిమాని చూసిన ప్రతి అభిమాని కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెబుతున్నారు.

    ఇక ఈ సినిమా స్టోరీ ఒకెత్తూ అయితే, స్క్రీన్ ప్లే సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచిందని ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఈ సినిమాలో ఒక హై ఎమోషన్ ను ఇచ్చి వదిలారని అందువల్ల ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అవుతుందని ప్రభాస్ అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. మరి ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విధానం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందట. ఇక 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్స్ అయితే టాప్ నాచ్ లో ఉన్నాయని చెబుతున్నారు. అలాగే ఈ సినిమా కూడా విజువల్ ట్రీట్ ఇవ్వబోతుందని అక్కడి అభిమానులు చెప్పడం విశేషం…

    ఇక ప్రభాస్, అమితాబచ్చన్, దీపిక పదుకునే వీళ్ళు నలుగురు కూడా చాలా మంచి పర్ఫామెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక దీపిక పదుకొనే అయితే ఇంతవరకు చేయని ఒక డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించడమే కాకుండా ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్క అభిమానిని కూడా కంటతడి పెట్టిస్తుందట. అలాంటి ఒక ఎమోషనల్ డ్రామా తో కూడిన పాత్ర చేయడం అనేది నిజంగా ఆమెకు కెరియర్ పరంగా చాలా బాగా హెల్ప్ అయ్యే అంశం అని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇక ప్రభాస్ తన మార్క్ కామెడీని చూపిస్తూనే యాక్షన్ సీన్స్ తో సినిమా ను ముందు ఉండి నడిపించాడు.

    ఇక అమితాబచ్చన్ కమలహాసన్ ఈ సినిమాని వాళ్ల భుజాల మీద మోసుకెళ్లినట్టుగా కూడా చెబుతున్నారు. ప్రభాస్ ఒక్కడు ఒకవైపు నిల్చుంటే వీళ్ళిద్దరూ రెండు పిల్లర్స్ లా నిలబడి సినిమాని సూపర్ సక్సెస్ చేసినట్టుగా కూడా తెలియజేస్తున్నారు.. ఇక సంతోష్ నారాయణన్ ఇచ్చిన మ్యూజిక్ పట్ల కూడా అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా సినిమాలోని కోర్ ఎమోషన్ ని ఎలివేట్ చేయడంలో ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందట. ఇక అమెరికా లో మంచి టాక్ తో రన్ అవుతున్న కల్కి ఇక్కడ ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది…