Virat Kohli : ఆశిష్ నెహ్రా రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ.. బాబోయ్ ఇంతకు మించిన దారుణం ఉంటుందా?

Virat Kohli మరోవైపు ఆశిష్ఠ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేయడం ద్వారా అతని అభిమానులు మండిపడుతున్నారు.. గోల్డెన్ డక్ ల విషయంలో ఆశిష్ నెహ్రా తో విరాట్ పోటీ పడటం సరికాదని, ఇంతకు మించిన దారుణం మరొకటి ఉండదని విరాట్ ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : June 25, 2024 10:11 pm

Virat Kohli has equaled Ashish Nehra's duckout record

Follow us on

Virat Kohli : టి20 వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విఫలమవుతూనే ఉన్నాడు. సోమవారం సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ హజిల్ వుడ్ బౌలింగ్లో గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ వీరోచితంగా బ్యాటింగ్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ వారందరి ఆశలను తలకిందులు చేస్తూ సున్నా పరుగులకే విరాట్ అవుట్ అయ్యాడు. 2016 t20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా తో జరిగిన సూపర్ -8 మ్యాచ్లో విరాట్ కోహ్లీ మెరుపులు మెరిపించాడు. ఏకంగా 82 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. ఈ ఓటమితో ఆస్ట్రేలియా టి20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది.. అయితే నాటి మ్యాజిక్ ను విరాట్ పునరావృతం చేస్తాడని అందరూ భావించారు.. కానీ, అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు..

విరాట్ కోహ్లీ 0 పరుగులకు అవుట్ కావడం ఈ టి20 ప్రపంచ కప్ లో ఇది రెండవసారి. అమెరికాతో జరిగిన లీగ్ మ్యాచ్లో విరాట్ గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు.. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్లో హజిల్ వుడ్ బౌలింగ్లో 0 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు.. 2010 టి20 ప్రపంచ కప్ లో భారత మాజీ పేస్ బౌలర్ నెహ్రా నెలకొల్పిన రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. హాజిల్ ఉడ్ బంతిని అంచనా లేకుండా.. గాల్లోకి లేపడంతో ఫీల్డర్ అమాంతం అందుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. అమెరికా, పాకిస్తాన్, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లపై ఆడిన మ్యాచ్లలో.. విరాట్ పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో విరాట్ 28 బంతుల్లో 37 పరుగులు చేశాడు.. ప్రస్తుత ప్రపంచ కప్ టోర్నీలో ఈ పరుగులే విరాట్ అత్యధిక స్కోర్ గా ఉన్నాయి.

టి20 వరల్డ్ కప్ కంటే ముందు విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అద్భుతంగా ఆడాడు. మెరుగ్గా బ్యాటింగ్ చేసి, ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత టి20 వరల్డ్ కప్ లో అదే స్థాయిలో ప్రతిభ చూపించలేకపోతున్నాడు. భారీగా పరుగులు చేయాల్సిన అతడు సున్నా లేదా సింగిల్ డిజిట్ స్కోర్ కే వెను తిరుగుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే సెమీఫైనల్ లోనైనా విరాట్ సత్తా చూపించాలని, అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత జట్టును గెలిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.. గత వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి గట్టి సమాధానం చెప్పాలని సూచిస్తున్నారు. మరోవైపు ఆశిష్ఠ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేయడం ద్వారా అతని అభిమానులు మండిపడుతున్నారు.. గోల్డెన్ డక్ ల విషయంలో ఆశిష్ నెహ్రా తో విరాట్ పోటీ పడటం సరికాదని, ఇంతకు మించిన దారుణం మరొకటి ఉండదని విరాట్ ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.