Homeబిజినెస్Zomato Q4 results growth: క్వార్టర్ 4 ఫలితాల్లో జొమాటో గ్రోత్..

Zomato Q4 results growth: క్వార్టర్ 4 ఫలితాల్లో జొమాటో గ్రోత్..

Zomato Q4 results growth: జొమాటో పేరెంట్ కంపెనీ ఎటర్నల్ 2026 చివరి త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఈ క్వార్టర్‌ (జనవరి-మార్చి 2026) లో కంపెనీ నికర లాభం రూ.174 కోట్లకు చేరింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.39 కోట్లు మాత్రమే ఉండగా.. ఈ ఏడాది 346% వృద్ధి సాధించింది. వినియోగదారుల సంఖ్య పెరగడం.. ఆర్డర్ వాల్యూమ్ పెరగడం.. ఆపరేషనల్ ఎఫిషియెన్సీ వల్ల ఈ పెరుగుదల సాధ్యమైందని తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి […]

Zomato Q4 results growth: జొమాటో పేరెంట్ కంపెనీ ఎటర్నల్ 2026 చివరి త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఈ క్వార్టర్‌ (జనవరి-మార్చి 2026) లో కంపెనీ నికర లాభం రూ.174 కోట్లకు చేరింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.39 కోట్లు మాత్రమే ఉండగా.. ఈ ఏడాది 346% వృద్ధి సాధించింది. వినియోగదారుల సంఖ్య పెరగడం.. ఆర్డర్ వాల్యూమ్ పెరగడం.. ఆపరేషనల్ ఎఫిషియెన్సీ వల్ల ఈ పెరుగుదల సాధ్యమైందని తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ లో నెంబర్ వన్ సంస్థ జోమాటో గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని పేరంట్ కంపెనీ అయిన ఎటర్నల్ రోజురోజుకు వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఎటర్నల్ రెవెన్యూ గత ఏడాది చివరి త్రైమాసికంలో రూ.5,833 కోట్లు ఉండగా.. ఇప్పుడు అది 196.5 శాతం పెరిగి రూ.17,292 కోట్లకు చేరింది. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ (Blinkit), ఇతర సేవల ద్వారా ఈ గణనీయమైన పెరుగుదల వచ్చింది. ముఖ్యంగా Blinkit వంటి క్విక్ కామర్స్ సెగ్మెంట్ డిమాండ్ ఎక్కువ కావడం ఈ రెవెన్యూ బూస్ట్‌కు కారణం.

ఆపరేషనల్ లాభాలు కూడా ఆకాశాన్ని తాకాయి. గత ఏడాది రూ. 72 కోట్ల EBITDA ఉండగా.. ఇప్పుడు అది 575 శాతం పెరిగి రూ.486 కోట్లకు చేరింది. ఖర్చుల నియంత్రణ, స్కేలింగ్ ప్రయోజనాలు, మరియు మార్జిన్ మెరుగుపడడం వల్ల ఈ భారీ జంప్ సాధ్యమైంది. ఇది కంపెనీ లాభాల్లోకి ప్రవేశించడానికి మరింత దగ్గర చేస్తోంది.

ఈ ఫలితాలు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగంలో ఎటర్నల్ ఆధిపత్యాన్ని మరింత బలపరిచాయి. దీంతో ప్రత్యర్థి కంపెనీ అయిన స్విగ్గీ కంటే మెరుగ్గా ఉంటుందని ఎటర్నర్ ప్రతినిధులు అంటున్నారు. మే 8న స్విగ్గీ తన 2026 ఫైనాన్స్ ఇయర్ క్వార్టర్ 4 ఫలితాలను ప్రకటించనుంది. ఆ సమయంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper