https://oktelugu.com/

NTR: పవన్ కళ్యాణ్ డైలాగ్ తో త్రివిక్రమ్ కి హింట్ ఇచ్చిన ఎన్టీయార్…

ఎన్టీఆర్ మాట్లాడుతూ సిద్దు జొన్నలగడ్డ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఇక ఇలాంటి ఒక క్యారెక్టర్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : April 9, 2024 / 09:44 AM IST

    NTR

    Follow us on

    NTR: నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ స్టార్ హీరో గా గుర్తింపు పొందుతున్నాడు… ఇక ఇది ఇలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరిని ఎంకరేజ్ చేయడంలో ఎన్టీఆర్ ముందు వరుస లో ఉంటాడు. ఇక ఇప్పటికే విశ్వక్ సేన్ సినిమా ఈవెంట్లకు వచ్చి తనను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇక దానికి తోడుగా సిద్దు జొన్నలగడ్డని కూడా ప్రస్తుతం ఎంకరేజ్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న జరిగిన “డిజే టిల్లు స్క్వేర్” సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చి ఈ ఈవెంట్ ని సక్సెస్ చేసారు అనే చెప్పాలి.

    ఇక ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ సిద్దు జొన్నలగడ్డ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఇక ఇలాంటి ఒక క్యారెక్టర్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. తను చిన్నప్పుడు కార్టూన్స్ చూస్తూ ఇలాంటి క్యారెక్టర్స్ మన మధ్యలో ఉంటే బాగుండేది అనుకునేవాడినని సిద్దు సినిమాలను చూస్తున్నంత సేపు నాకు ఆ కార్టూన్లు ఎలాగైతే ఎంటర్ టైన్ చేసేవో తను కూడా అలా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడని చెప్పాడు.

    ఇక అందులో భాగంగానే ఆయన తను చేయబోయే ‘దేవర ‘ సినిమా గురించి కూడా చెబుతూ మధ్యలో త్రివిక్రము ను ఇన్వాల్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో చెప్పినట్టుగా “వీటిలో ఏవైనా తప్పులు ఉంటే చక్కబెట్టు ఇక మొత్తానికైతే మేము ఇక్కడ ఉన్నామని గుర్తించు” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగు కి అక్కడున్న ఎన్టీఆర్ అభిమానులతో పాటు చాలామంది ప్రేక్షకులు సందడి చేశారు. ఇక దాంతో త్రివిక్రమ్ వచ్చి ఎన్టీఆర్ ని హగ్ చేసుకున్నాడు.

    అయితే ఎన్టీఆర్ అలా అనడానికి గల కారణం ఏంటి అంటే గుంటూరు కారం సినిమాతో త్రివిక్రమ్ ప్లాప్ డైరెక్టర్ గా మారిపోయాడు. కాబట్టి ఆ ఫ్లాప్ నుంచి బయట పడటానికి మాతో ఒక సినిమా చేయొచ్చు కదా అందుకే మేము ఇక్కడున్నాం, మమ్మల్ని గుర్తించండి అంటూ ఇన్ డైరెక్ట్ గా త్రివిక్రమ్ కి హింట్ ఇచ్చినట్టుగా చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో ఈ న్యూస్ ని వైరల్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఎన్టీయార్ చెప్పిన మాటలకు ఇటు ఎన్టీఆర్, అటు త్రివిక్రమ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారనే చెప్పాలి…