Ugadi Panchangam 2024: శ్రీ క్రోధి నామ సంవత్సరం.. ఈ రాశుల వారు ఈ ఏడాది జాగ్రత్తగా ఉండాలి..

తెలుగు సంవత్సరం ప్రారంభం రోజుగా భావించే చైత్ర మాసం శుక్ల పక్షం పాఢ్యమి తిథిన ఉగాది పర్వదినంగా జరుపుకుంటాం. ఈ పండుగను చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకోవడం ఆనవాయితీ. 2024 ఇంగ్లిష్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏప్రిల్‌ 9న ఉగాది పండుగ.

Written By: Raj Shekar, Updated On : April 9, 2024 9:40 am

Ugadi Panchangam 2024

Follow us on

Ugadi Panchangam 2024: తెలుగు సంవత్సరాలు 60. మహర్షి నారదుడి పిల్లల పేర్ల మీదుగా తెలుగు సంవత్సరాలు ఏర్పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. 60 ఏళ్లు పూర్తి అయితే తిరిగి మళ్లీ మొదటి ఏడాది మొదలవుతుంది. ఇలా సంవత్సరానికి ఒక పేరు రావడం వెను ఓ కథ కూడా ఉంది. ఇక తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కో పేరుకు ఒక్కో అర్థం కూడా ఉంటుంది. మొదటిది వసంత రుతువు, మొదటి నెల చైత్రమాసం.. మొదటి తిథి పాఢ్యమి. ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది.

నేడే ఉగాది..
తెలుగు సంవత్సరం ప్రారంభం రోజుగా భావించే చైత్ర మాసం శుక్ల పక్షం పాఢ్యమి తిథిన ఉగాది పర్వదినంగా జరుపుకుంటాం. ఈ పండుగను చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకోవడం ఆనవాయితీ. 2024 ఇంగ్లిష్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏప్రిల్‌ 9న ఉగాది పండుగ. ఇక తెలుగు సంవత్సరాలకు ఒక్కో పేరు ఉంటుందనుకున్నాం. ఈ తెలుగు సంవత్సరానికి పేరు శ్రీక్రోధి నామ సంవత్సరం.

అర్థం ఇదే..
క్రోధం అంటే అర్థం కోపం.. కనుక ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం కనుక ప్రజలు ఎక్కువ కోపం, ఆవేశం కలిగి ఉంటారని పండితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఆగ్రహావేశాలు కలగడం, దేశంలో రాష్ట్రాల మధ్య విబేధాలు, భిన్నాభిప్రాయాలు, కోపం, ఆగ్రహం కలుగుతాయని, దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుందని ఎక్కువా యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే ఈ ఏడాదంతా ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ..
బ్రహ్మ తనయుడు విష్ణు మానస పుత్రుడు నారదుడి బ్రహ్మచారి అన్న సంగతి తెలిసిందే.. అయితే పురాణాలు నారదుడి పిల్లలే తెలుగు నెలలుగా పేర్కొన్నాయి. దీనికి కారణం నారదుడి గర్వం తలకేక్కినట్లు భావించిన శ్రీమహా విష్ణువు అతడి గర్వాన్ని అణచాలని భావించాడు. దీంతో నారదుడిని మాయ అనే స్త్రీగా చేశాడు. స్త్రీ రూపంలో ఉన్న మాయను ఒక రాజు మోహించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 60 మంది పిల్లలు. వీరు ఓ యుద్ధంలో అకాలమరణం పొందుతారు. అప్పుడు విష్ణువు తన మాయను తొలగించి నాదుడిగా మార్చాడు. అంతేకాదు. నీకు కలిగిన సంతానం 60 మందికి గుర్తుగా 60 సంవత్సరాలు ఏర్పడతాయని వరం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి.