Nidhhi Agerwal: సినీ సెలబ్రిటీలకు కాస్త పేరు రావడంతో మరిన్ని డబ్బులు సంపాదించేందుకు యాడ్స్ లో నటిస్తుంటారు. అయితే కొన్నిసార్లు వారు చేసే యాడ్స్ వల్ల ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది. వెనకా ముందు ఆలోచించకుండా డబ్బుల కోసం ఏది పడితే అది చేస్తే చివరకు నెటిజన్ల ట్రోలింగ్ కు గురికావాల్సి వస్తుంది. పెద్ద పెద్ద స్టార్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పలేదు.

గతంలో రష్మిక చేసిన డ్రాయర్ యాడ్ ఎంతలా విమర్శలకు దారి తీసిందో చూశాం. బాలీవుడ్ సెలబ్రిటీలు అయిన కత్రినా కైఫ్, హృతిక్ రోషన్ చేసిన jomoto యాడ్ కూడా అప్పట్లో తీవ్ర వివాదం రేపింది. ఇక పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసిన ఒకటి, రెండు యాడ్స్ కూడా ఇలాగే విమర్శల పాలయ్యాయి. ఆర్టీసీ మీద కించపరచే కామెంట్లు చేశారంటూ ఏకంగా సజ్జనార్ నోటీసులు కూడా జారీ చేశారు.
Also Read: Roja: రోజా లేని ‘జబర్దస్త్’ లో చెలగిరేపోనున్న కామెడీయన్..!
అయితే ఇప్పుడు గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఓ యాడ్ ను తన సోషల్ మీడియా ఖాతాలో ప్రమోట్ చేసింది. Durex index అనే కండోమ్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేసింది. మీ పార్టనర్ తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు వీటిని తప్పకుండా వాడి మంచి అనుభూతిని పొందండి అంటూ తెగ ఫిలాసఫీ కూడా ఇచ్చేసింది. ఇంకేముంది దీన్ని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

నీ నుంచి ఇలాంటి యాడ్ ఊహించలేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరైతే మాకు పార్ట్నర్ లేదు.. నీతోనే ట్రై చేయమంటావా అంటూ దారుణమైన కామెంట్లు పెడుతున్నారు. డబ్బుల కోసం ఇలాంటి యాడ్ అవసరమా అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూత్ ను చెడగొట్టే ఇలాంటి యాడ్స్ అవసరమా అంటూ ఇంకొందరు చురకలంటించారు. అయితే ఆమెకు మరికొందరు సపోర్టుగా కూడా నిలుస్తున్నారు. కండోమ్ వాడితే తప్పేంటి మంచిదే కదా అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి నిధి అగర్వాల్ ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది.
Also Read:Pawan Kalyan Rythu Bharosa Yatra: కౌలు రైతుల కుటుంబాల కన్నీళ్లు తుడిచిన పవన్ కళ్యాణ్