Wife And Husband: కట్టుకున్న వాడి వేధింపులతో భార్య చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బంధువులు భర్త కుటుంబీకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భర్త సూటిపోటి మాటలకే తమ కూతురు చనిపోయిందని హతురాలి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.

మాడ్గుల మండలం అర్కపల్లికి చెందిన మానసను వనస్థలిపురం క్రిస్టియన్ కాలనీకి చెందిన దేవిరెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నకానుకలు ముట్టజెప్పారు. దేవిరెడ్డి మెడికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా మానస ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే దేవిరెడ్డి సంసారానికి పనికిరాడని పలుమార్లు మానస తల్లిదండ్రులకు చెప్పడంతో మానసపై పలుమార్లు దేవిరెడ్డి చేయిచేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
Also Read: AP New Cabinet Ministers: అమాత్యులు.. ఊరికే కాలేదు.. అందలం వెనుక సుదీర్ఘ పోరాటం
ఈ క్రమంలో వారి మధ్య ఏర్పడిన గొడవలకు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించి ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నాలు కూడా జరిగాయి. దీంతో దేవిరెడ్డిపై 2021లో మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటున్న మానస ఈనెల 9న మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతరకు కుటుంబ సభ్యులతో వెళ్లింది. అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో మృతి చెందినట్లు నిర్ధారించారు. అయినా కుటుంబ సభ్యులు నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా వారు కూడా అదే విషయం చెప్పారు. ఈమె చనిపోయిందని నిర్ధారించారు. దీనిపై కోపోద్రిక్తులైన మానస తల్లిదండ్రులు దేవిరెడ్డి వేధింపుల వల్లే చనిపోయిందని అంత్యక్రియలు వారే చేయాలని డిమాండ్ చేశారు. దీనికి భయపడిన దేవిరెడ్డి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తలదాచుకోవడంతో గొడవ జరిగింది. దేవిరెడ్డి కుటుంబ సభ్యులు మానస అంత్యక్రియలు జరపాలని ధర్నాకు దిగారు.
Also Read:CM KCR- Cabinet Extension: వైసీపీ విస్తరణ చూసి కేసీఆర్ పునరాలోచనలో పడ్డారా?