https://oktelugu.com/

Varalaxmi Sarathkumar: వరలక్ష్మికి నేను ఫస్ట్ లవర్ కాదు, పెళ్లై నెల రోజులు కాకుండానే బాంబు పేల్చిన భర్త! ఊహించని నిర్ణయం!

వరలక్ష్మిని వివాహం చేసుకున్న నికొలాయ్ కి ముంబైలో పలు వ్యాపారులు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఆర్ట్ గ్యాలరీ ఓనర్. నికొలాయ్ సంపద విలువ రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం. కాగా ఆయనకు చాలా కాలం క్రితమే వివాహమైంది. మాజీ భార్య పేరు కవిత. వీరికి ఒక అమ్మాయి సంతానం. తండ్రి వద్దే కూతురు పెరుగుతున్నట్లు సమాచారం. నికొలాయ్ కూతురు వయసు 20 ఏళ్లకు పై మాటే. ఇది షాకింగ్ పరిణామం.

Written By:
  • S Reddy
  • , Updated On : July 18, 2024 / 02:56 PM IST

    Varalaxmi Sarathkumar

    Follow us on

    Varalaxmi Sarathkumar: స్టార్ కిడ్ వరలక్ష్మి శరత్ కుమార్ లేడి విలన్ గా టాలీవుడ్ ని ఊపేస్తోంది. ఆమె లక్కీ చార్మ్ గా అవతరించింది. వరలక్ష్మి నటించిన చిత్రాలన్నీ దాదాపు హిట్. క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, హునుమాన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో ఆమె కీలక రోల్స్ చేశారు. కాగా వరలక్ష్మి ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. ముంబై కి చెందిన వ్యాపారవేత్త నికొలాయ్ సచ్ దేవ్ తో ఆమె ఏడడుగులు వేసింది. జులై 3న చెన్నైలో వరలక్ష్మి-నికొలాయ్ వివాహం ఘనంగా జరిగింది. కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించాడు.

    వరలక్ష్మిని వివాహం చేసుకున్న నికొలాయ్ కి ముంబైలో పలు వ్యాపారులు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఆర్ట్ గ్యాలరీ ఓనర్. నికొలాయ్ సంపద విలువ రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం. కాగా ఆయనకు చాలా కాలం క్రితమే వివాహమైంది. మాజీ భార్య పేరు కవిత. వీరికి ఒక అమ్మాయి సంతానం. తండ్రి వద్దే కూతురు పెరుగుతున్నట్లు సమాచారం. నికొలాయ్ కూతురు వయసు 20 ఏళ్లకు పై మాటే. ఇది షాకింగ్ పరిణామం.

    వరలక్ష్మి-నికోలాయ్ కి చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. వీరిద్దరూ మిత్రులు అట. ఇటీవల ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి లవ్ కమ్ అరేంజ్డ్ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం మీడియా ముందుకు వచ్చిన నికొలాయ్ సచ్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరలక్ష్మిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అయితే ఆమె ఫస్ట్ లవర్ నేను కాదు… అన్నాడు. దాంతో అందరూ షాక్ తిన్నారు.

    నికొలాయ్ మాట్లాడుతూ.. నాకు తమిళం రాదు. అందుకు మీరు నన్ను క్షమించాలి. తమిళంలో పొండటి(భార్య) అనే పదం ఒక్కటే నేర్చుకున్నాను. ఇకపై నా ఊరు ముంబై కాదు, చెన్నై. నన్ను నేను పరిచయం చేసుకుంటాను. వరలక్ష్మి శరత్ కుమార్ ని నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. ఆమె తన పేరు మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకు బదులుగా నేను,నా కూతురు మా పేర్లకు వరలక్ష్మి పేరును తగిలించుకుంటాం… అంటూ తన షాకింగ్ నిర్ణయాన్ని తెలియజేశాడు.

    సాధారణంగా భర్త పేరు భార్యలు తమ పేర్ల చివర జోడిస్తారు. అందుకు భిన్నంగా భార్య పేరును తన పేరుకు తగిలిస్తాను అంటున్నాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ… మేము ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ నేను వరలక్ష్మి ఫస్ట్ లవర్ ని కాదు. ఆమె ఫస్ట్ లవర్ సినిమానే. అందుకే వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తుంది, అని స్పష్టత ఇచ్చాడు. ఇది వరలక్ష్మి అభిమానులకు సంతోషం పంచే ప్రకటన అనడంలో సందేహం లేదు.

    కాగా వరలక్ష్మి పై ఎఫైర్ పుకార్లు ఉన్న సంగతి తెలిసిందే. హీరో విశాల్ తో ఆమె కొన్నాళ్లు రిలేషన్ లో ఉన్నారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అనంతరం వీరు మనస్పర్థలతో విడిపోయారట. విశాల్ ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాడు. వరలక్ష్మి వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. ప్రస్తుతం వరలక్ష్మి రాయన్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. ఈ మూవీ జులై 26న విడుదల కానుంది.

    రాయన్ ధనుష్ 50వ చిత్రం కాగా ఆయన దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక రోల్స్ చేశారు. అలాగే తెలుగులో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘క’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు.