Peddireddy RamaChandra Reddy : పుంగనూరులో ప్రజా తిరుగుబాటు.. పెద్దిరెడ్డి కుటుంబానికి ఇక స్థానం లేనట్టే

గన్ క్యాబినెట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్. ఒక విధంగా చెప్పాలంటే రాయలసీమకు సామంత రాజు. గత ఐదేళ్లుగా రాయలసీమలో చీమ చిటుకుమన్న ఇట్టే తెలిసిపోయేది పెద్దిరెడ్డికి. కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడించే బాధ్యత తీసుకున్నారు పెద్దిరెడ్డి. చంద్రబాబు కుప్పంలో అడుగు పెట్టాలనుకున్నప్పుడు నరకం చూపించారు. అడ్డగించారు కూడా. చివరకు అంగళ్లలో హింసాత్మక ఘటనలకు తెరతీశారు.

Written By: Dharma, Updated On : July 18, 2024 2:53 pm
Follow us on

Peddireddy RamaChandra Reddy: పుంగనూరు అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సామ్రాజ్యం. అక్కడ ప్రత్యేక రాజ్యాంగం అమలవుతుంది. ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టాలంటేనే భయం వేసే పరిస్థితి ఉండేది. శ్రీకాకుళం జిల్లా నుంచి టిడిపి శ్రేణులు తిరుపతి సైకిల్ పై బయలుదేరాయి. పుంగనూరు మీదుగా తిరుమల దర్శనానికి వెళుతుండగా.. పెద్దిరెడ్డి అనుచరులు సైకిల్ పై ఉన్న జెండాలను తొలగించారు. వారు వేసుకున్న దుస్తులను తొలగించి అవమానించారు. అటువంటి పెద్దిరెడ్డి పుంగనూరు సామ్రాజ్యం ఇప్పుడు కుప్పకూలిపోయింది. పుంగనూరు వెళ్లాలంటే పెద్దిరెడ్డి తో పాటు ఆయన కుమారుడు, ఎంపీ మిధున్ రెడ్డికి ముచ్చెమటలు పడుతున్నాయి. పుంగనూరులో అడుగుపెట్టిన పెద్దిరెడ్డికి గట్టిగానే షాక్ ఇచ్చారు స్థానికులు. ఇప్పుడు ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి సైతం అదే పరిస్థితి ఎదురైంది.

జగన్ క్యాబినెట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్. ఒక విధంగా చెప్పాలంటే రాయలసీమకు సామంత రాజు. గత ఐదేళ్లుగా రాయలసీమలో చీమ చిటుకుమన్న ఇట్టే తెలిసిపోయేది పెద్దిరెడ్డికి. కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడించే బాధ్యత తీసుకున్నారు పెద్దిరెడ్డి. చంద్రబాబు కుప్పంలో అడుగు పెట్టాలనుకున్నప్పుడు నరకం చూపించారు. అడ్డగించారు కూడా. చివరకు అంగళ్లలో హింసాత్మక ఘటనలకు తెరతీశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారు. చంద్రబాబుపై అక్రమాస్తుల కేసులతో పాటు అంగళ్ళ కేసులను సైతం మెడకు చుట్టుకునేలా చేశారు. హిందూపురంలో బాలకృష్ణను ఓడించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేశారు. బావ బావమరుదులిద్దరికీ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకుండా చేస్తానని శపధం చేశారు. కానీ కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయారు.

పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఐదేళ్లుగా ఆయన లోక్ సభలో వైసిపి పార్లమెంటరీ నేతగా వ్యవహరించారు. టిడిపి నుంచి ఎన్నికైన ముగ్గురు సభ్యులను నియంత్రించడానికి ప్రయత్నించేవారు. ఒకసారి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ను లోక్ సభలో అవమానించారు కూడా. జగన్ కు కుడి భుజంగా ఉంటూ.. వైసీపీని మరోసారి విజయపథంలోకి తేవడానికి మిధున్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. మొన్నటికి మొన్న ఎన్నికలకు ముందు వైసీపీ అభ్యర్థుల మార్పు వెనుక మిధున్ రెడ్డి ఉన్నారు. అభ్యర్థుల పేర్లను స్క్రూట్ని కూడా ఆయనే చేశారు. పార్టీ కార్యాలయంలో సజ్జలతో పాటు మిధున్ రెడ్డి కూర్చుని.. ఉద్యోగ ఇంటర్వ్యూలు మాదిరిగా వైసిపి అభ్యర్థులను ఎంపిక చేశారు.

ఎన్నికల నిర్వహణ అంత మిధున్ రెడ్డి పర్యవేక్షించారు. చివరకు పిఠాపురంలో పవన్ ను ఓడించే బాధ్యత కూడా తీసుకున్నారు. ఇందుకుగాను రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున మనుషులను తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా తండ్రీ కొడుకుల ఆధిపత్యానికి,దూకుడుకు అంతే లేకుండా పోయింది. దీనికి కారణం పుంగనూరులో వారికి ఉన్న బలం. ఆ బలం ఇప్పుడు పెకిలించే పనిలో పడింది కూటమి ప్రభుత్వం.

మొన్న ఆ మధ్యన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో అడుగు పెట్టాలని చూశారు. కానీ అడ్డగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ వంతు ఆయన కుమారుడికి వచ్చింది. పుంగనూరు రావడంతో వెళ్లిపోవాలని స్థానిక ప్రజలు నినాదాలు చేశారు. కూటమి కార్యకర్తల వారికి తోడు కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వచ్చి సముదాయించాల్సిన పరిస్థితి నెలకొంది. పెద్దిరెడ్డి పుంగనూరు వేదికగా రాజకీయం కొనసాగించడం కష్టంగానే కనిపిస్తోంది. ఎలాంటి సామ్రాజ్యం.. ఎలా మారిందో చూస్తే.. రాజకీయ నేతలకు ఇదో గుణపాఠంగా మిగులుతుంది. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాభిమానం పొందగలగాలి. కానీ పుంగనూరులో అలా చేయలేదు పెద్దిరెడ్డి. ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.