https://oktelugu.com/

డిసెంబరులో సెట్స్ పైకి  బంగార్రాజు?

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా ఒకటి.  ఈ సినిమాలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జునతో ఆ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించారు. Also Read: నాగచైతన్య బర్త్ డే ట్రీట్.. ఏంటో తెలుసా? ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళ లేదు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2020 / 03:48 PM IST
    Follow us on

    అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో సోగ్గాడే చిన్నినాయన’ సినిమా ఒకటి.  ఈ సినిమాలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణనాగార్జునతో ఆ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించారు.

    Also Read: నాగచైతన్య బర్త్ డే ట్రీట్.. ఏంటో తెలుసా?

    ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళ లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం డిసెంబరులో ఈ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

    `సోగ్గాడే చిన్ని నాయిన‌` దాదాపు 50 కోట్లు వ‌సూలు చేసింది. ఆ త‌ర‌వాత‌.. సోగ్గాడేకి.. సీక్వెల్ గా `బంగార్రాజుచేస్తాన‌ని ప్ర‌క‌టించారు. క‌ల్యాణ్ కృష్ణ  ఆ స్క్రిప్టు ప‌నులు ఎప్పుడో పూర్తి చేశారు. అయితే.. క‌థ‌లో కొన్ని సందేహాలు ఉండ‌డంతోస్క్రిప్టు తాను అనుకున్న విధంగా రాక‌ పోవ‌డంతో ఈ సీక్వెల్ ని ప‌క్కన పెట్టారు నాగ్‌.

    Also Read: కరోనాలోనూ తగ్గేది లేదంటున్న యువ హీరోలు..!

     క‌ల్యాణ్ కృష్ణ కూడా వేర్వేరు ప్రాజెక్టుల‌లో ప‌డిపో యాడు. ఇప్పుడు మ‌ళ్లీ `బంగార్రాజు`నాగార్జున దృష్టి పెట్టిన‌ట్టు టాక్‌. ఇటీవ‌ల‌… క‌ల్యాణ్ కృష్ణ నాగ్ ని క‌లిసి ఫైన‌ల్ నేరేష‌న్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈసారి క‌థ విష‌యంలో నాగ్ పూర్తి సంతృప్తిని వ్య‌క్త ప‌రిచార్ట‌. అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లోనే ఈ సినిమా ఉండ‌బోతోంది. ఈసారి నాగ‌చైత‌న్య కూడా నాగ్ తో క‌ల‌సి న‌టించ‌బోతున్నాడు. చైతూ కాల్షీట్లు దొర‌కాల్సివుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    సింగిల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. కాగా ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్‌ లో బిజీగా ఉన్నాడట. ఇప్పటికే ట్యూన్స్ కూడా పూర్తయ్యాయట. మొత్తానికి బంగార్రాజు’ రాక ఆలస్యం అయినాఆసక్తి ఉండేలా ఉంది. ఎలాగూ సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.