https://oktelugu.com/

గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు.. ఈసారి గెస్ట్ ఎవరంటే?

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. బిగ్ బాస్ షో ప్రస్తుతం 12వ వారంలోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్-4 సీజన్ ముగింపు దశకు చేరుకుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. దీంతో ప్రేక్షకులు బిగ్ బాస్ ను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. మరోవైపు బిగ్ బాస్ నిర్వాహాకులు సైతం గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read: బిగ్ బాస్-4: అవినాష్ ఇల్లీగల్ ఎఫైర్స్.. బయటపడిందిలా? కిందటి వారంలో బిగ్ బాస్ నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2020 / 03:51 PM IST

    bigboss 4 participants

    Follow us on

    తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. బిగ్ బాస్ షో ప్రస్తుతం 12వ వారంలోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్-4 సీజన్ ముగింపు దశకు చేరుకుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. దీంతో ప్రేక్షకులు బిగ్ బాస్ ను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. మరోవైపు బిగ్ బాస్ నిర్వాహాకులు సైతం గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    Also Read: బిగ్ బాస్-4: అవినాష్ ఇల్లీగల్ ఎఫైర్స్.. బయటపడిందిలా?

    కిందటి వారంలో బిగ్ బాస్ నుంచి లాస్య ఎమినేషన్ అయింది. లాస్యకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ హౌస్ లో మాత్రం ఎవరితో గొడవ పడకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ కారణంగానే బిగ్ బాస్ ఆమెను ఎలిమినేట్ చేశాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసుతం హౌస్ లో దెత్తడి హరిక.. మొనాల్ గజ్జర్.. అరియానా.. అభిజిత్.. అఖిల్.. అరియానా.. అవినాష్ మాత్రమే మిగిలి ఉన్నారు.

    Also Read: ఈసారి కూడా ‘బిగ్ బాస్’ వారికి హ్యండిచ్చినట్టేనా?

    ఈ ఏడుగురిలో చివరి వరకు ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎలిమినేషన్ మరింత రసవత్తరంగా మారనుందని టాక్ విన్పిస్తోంది. ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వచ్చే నెల 20న నిర్వహించేందుకు నిర్వహాకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈసారి గ్రాండ్ ఫినాలేకు హాజరయ్యే గెస్ట్ ఎవరా? అనేది ఆసక్తి బిగ్ బాస్ అభిమానుల్లో నెలకొంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    బిగ్ బాస్-4 ఫైనల్ ఎపిసోడ్ కు గెస్ట్‌గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారనే లీకులు విన్పిస్తున్నాయి. కాగా ఎన్టీఆర్ తెలుగు బిగ్ బాస్ తొలి సీజన్ కు హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్ ను ఎన్టీఆర్ విజయవంతంగా నిర్వహించాడు. బిగ్ బాస్-2కి విక్టరీ వెంకటేష్.. బిగ్ బాస్-3కి గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. తాజాగా బిగ్ బాస్-4కు ఎన్టీఆర్ హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది.