Mahesh Babu: మహేష్ లేటెస్ట్ లుక్ చూశారా.. హాలీవుడ్ హీరోలు ఏం సరిపోతారు? రాజమౌళి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు!

ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో ఎస్ఎస్ఎంబి 29 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. రెండేళ్లకు పైగా సమయాన్ని మహేష్ బాబు ఈ చిత్రానికి కేటాయించాల్సి ఉంది. రాజమౌళి ఒక పట్టాన సినిమా పూర్తి చేయడు. అనుకున్న సమయానికి కనీసం ఏడాది పైగా తీసుకుంటారు. ఎస్ఎస్ఎంబి 29 విడుదలయ్యేది మూడేళ్ళ తర్వాతే అనే వాదన వినిపిస్తోంది.

Written By: S Reddy, Updated On : July 7, 2024 5:11 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: మహేష్ బాబు కెరీర్ పీక్స్ లో ఉంది. ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం సైతం రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మహేష్ బాబు ఫేమ్ కి అది నిదర్శనం. నెక్స్ట్ మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైం రాజమౌళి-మహేష్ బాబు కలిసి చిత్రం చేస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ సమకూర్చారు. స్క్రిప్ట్ ఫైనల్ చేశారు.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో ఎస్ఎస్ఎంబి 29 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. రెండేళ్లకు పైగా సమయాన్ని మహేష్ బాబు ఈ చిత్రానికి కేటాయించాల్సి ఉంది. రాజమౌళి ఒక పట్టాన సినిమా పూర్తి చేయడు. అనుకున్న సమయానికి కనీసం ఏడాది పైగా తీసుకుంటారు. ఎస్ఎస్ఎంబి 29 విడుదలయ్యేది మూడేళ్ళ తర్వాతే అనే వాదన వినిపిస్తోంది.

కాగా ఈ చిత్రం కోసం మహేష్ బాబు సన్నద్ధం అవుతున్నారు. గతంలో బాగా పెరిగిన గడ్డంలో మహేష్ బాబు కనిపించలేదు. ఆయన మీసం కూడా చాలా లైట్ గా ఉండేలా చూసుకుంటాడు. అయితే రాజమౌళి ప్రతి హీరోని భిన్నంగా చూపిస్తారు. గతంలో ఎన్నడూ ట్రై చేయని లుక్ లో ప్రజెంట్ చేస్తాడు. మహేష్ ని కూడా ఆయన ఫ్యాన్స్ సర్ప్రైజ్ అయ్యేలా సిద్ధం చేస్తాడు అనడంలో సందేహం లేదు. దానిలో భాగంగానే మహేష్ బాబు జుట్టు, గడ్డం పెంచుతున్నారు.

తాజాగా మహేష్ లుక్ లీక్ అయ్యింది. ఫ్యామిలీతో పాటు బయటకు వెళ్లిన మహేష్ బాబు తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఎయిర్పోర్ట్ లో మీడియా ప్రతినిధులు ఆయన్ని తమ కెమెరాలలో బంధించారు. మహేష్ లుక్ కిరాక్ తెప్పించింది. హాలీవుడ్ హీరోలను తలదన్నేలా మహేష్ బాబు ఉన్నారు. శాంపిల్ ఇలా ఉంటే.. రాజమౌళి మూవీలో మహేష్ బాబు ఎలా ఉంటాడో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఈ చిత్రానికి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటులు పని చేయనున్నారు. బడ్జెట్ దాదాపు రూ. 800 కోట్లు. జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందించనున్నారు.