https://oktelugu.com/

రవితేజ మూవీకి కోలీవుడ్ బ్యూటీ నో!

ఈ మధ్య ఆశించిన విజయాలు రాకపోయినా తెలుగులో మంచి  స్టార్డమ్‌, విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు రవితేజ. అవకాశం వస్తే అతని సరసన నటించేందుకు స్టార్ హీరోయిన్లు సైతం వెంటనే ఓకే చెబుతారు. కానీ, కోలీవుడ్‌కు చెందిన ఓ యువ నటి మాత్రం రవితేజ సరసన హీరోయిన్‌ ఆఫర్ వస్తే మాత్రం రిజెక్ట్ చేసిందట. ఆ ముద్దుగుమ్మ పేరు  మాళవికా మోహనన్. కేరళకు చెందిన ఈ  హాట్ యాక్ట్రెస్‌.. తొలుత మలయాళంలో నటించి ఆపై కన్నడ, […]

Written By:
  • admin
  • , Updated On : June 14, 2020 / 02:47 PM IST
    Follow us on


    ఈ మధ్య ఆశించిన విజయాలు రాకపోయినా తెలుగులో మంచి  స్టార్డమ్‌, విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు రవితేజ. అవకాశం వస్తే అతని సరసన నటించేందుకు స్టార్ హీరోయిన్లు సైతం వెంటనే ఓకే చెబుతారు. కానీ, కోలీవుడ్‌కు చెందిన ఓ యువ నటి మాత్రం రవితేజ సరసన హీరోయిన్‌ ఆఫర్ వస్తే మాత్రం రిజెక్ట్ చేసిందట. ఆ ముద్దుగుమ్మ పేరు  మాళవికా మోహనన్. కేరళకు చెందిన ఈ  హాట్ యాక్ట్రెస్‌.. తొలుత మలయాళంలో నటించి ఆపై కన్నడ, తమిళ్, హిందీ చిత్రాలు కూడా చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పేట’తో కోలీవుడ్‌కు పరిచయమైన మాళవికా మంచి క్రేజ్ సంపాదించుకుంది. దాంతో, మరో అగ్ర  కథానాయకుడు విజయ్‌త కలిసి ‘మాస్టర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

    లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. కానీ, లాక్‌డౌన్‌ కారణంగా విడుదల వాయిదా పడింది. విజయ్ సినిమా అంటే  కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆసక్తి  ఏర్పడుతుంది. దాంతో, మూవీ రిలీజ్‌ కాకముందే  ఈ చిత్ర హీరోయిన్‌ మాళవికకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ హీరోగా తమిళ డైరెక్టర్ ఆనంద్‌ అన్నమలై  గతేడాది ప్రకటించిన ‘హీరో’ అనే మూవీలో కూడా మాళవిక హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే, విజయ్‌, ఆనంద్‌ మధ్య క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా ఈ చిత్రం నిరవధికంగా వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. అయినా సరే మాళవికలను పలువురు దర్శక, నిర్మాతలు సంప్రదిస్తూనే ఉన్నారు. ఈ  క్రమంలో రవితేజ హీరోగా ప్లాన్ చేసిన ఓ మూవీలో నటించాలని నిర్మాతలు ఆమెను కలిశారట. కథ చెప్పి భారీ రెమ్యునరేషన్‌ ఇస్తామని కూడా ఆఫర్ చేశారట. కానీ, ఈ ఆఫర్ను మాళవిక రిజెక్ట్ చేయడంతో వాళ్లు షాకయ్యారట. ఆమె  పెద్ద ప్రాజెక్ట్‌ను కాదనుకోవడానికి కారణం లేకపోలేదు. తాను నటించిన ‘మాస్టర్’పై ఆమె భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ మూవీ రిలీజైన తర్వాతే  కొత్త సినిమాలకు  ఓకే చెప్పాలని మాళవిక నిర్ణయం తీసుకుందట. ‘మాస్టర్’ హిట్టయి.. తనకు మంచి  పేరొస్తే ఫర్వాలేదు కానీ.. ప్రతికూల ఫలితం వస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. మాళివిక ఫ్యూచర్ ఎలా ఉంటుందో మరి.