‘బాబు’ ఇంటి వద్ద పనిచేసే కానిస్టేబుల్ కు కరోనా..!

కరోనా వైరస్ భారిన పడకుండా ఉండేందుకు చంద్రబాబు ఎన్నో చర్యలను తీసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలను సైతం ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. అయితే బాబు ఇంటి వరకూ కరోనా చేరింది. ఆయన ఇంటి వద్ద పనిచేసిన గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. మీ 5వ తేదీన చంద్రబాబు ఇంటి వద్ద విధులు నిర్వహించేందుకు వెళ్లి 7వ తేదీన తిరిగి వచ్చాడు. అనంతరం కొంత నలతగా ఉన్నట్లు గమనించి వైద్యులను […]

Written By: Neelambaram, Updated On : June 14, 2020 4:22 pm
Follow us on

కరోనా వైరస్ భారిన పడకుండా ఉండేందుకు చంద్రబాబు ఎన్నో చర్యలను తీసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలను సైతం ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. అయితే బాబు ఇంటి వరకూ కరోనా చేరింది. ఆయన ఇంటి వద్ద పనిచేసిన గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. మీ 5వ తేదీన చంద్రబాబు ఇంటి వద్ద విధులు నిర్వహించేందుకు వెళ్లి 7వ తేదీన తిరిగి వచ్చాడు. అనంతరం కొంత నలతగా ఉన్నట్లు గమనించి వైద్యులను సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. పరీక్ష లో కరోనా పాజిటివ్ గా తేలింది.

విధుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లగా అక్కడ ఓ కానిస్టేబుల్ వైరస్ భారిన పడినట్లు తేలింది..అతని నుంచి బాపట్ల కానిస్టేబుల్ కు వైరస్ సోకింది. దీంతో కానిస్టేబుల్ ను కోవిడ్ ఆసుపత్రికి పంపించడంతోపాటు, కుటుంబ సభ్యులను హొమ్ క్వారంటైన్ లో ఉంచారు. వారికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. కానిస్టేబుల్ కు కరోనా లక్షణాలు లేకుండానే ఉండటం గమనార్హం. మరోవైపు హైదరాబాద్ లో చంద్రబాబు నివాసం వద్ద నగర పాలక సంస్థ అధికారులు శానిటేషన్ చర్యలు చేపట్టారు