https://oktelugu.com/

Yadamma Arrested: జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు అరెస్ట్ .. అసలు ఏం జరిగిందంటే?

యాదమ్మ రాజు ఎందుకు అరెస్ట్ అయ్యాడనే సందిగ్ధత అందరిలో మొదలైంది. బయో లో ఉన్న లింక్ క్లిక్ చేయగా అసలు మ్యాటర్ ఏమిటో తెలిసింది. కాగా ఇటీవల యాదమ్మ రాజు ఓ వెబ్ సిరీస్ లో నటించాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 4, 2024 / 09:25 AM IST

    Yadamma Arrested

    Follow us on

    Yadamma Arrested: పటాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు కమెడియన్ యాదమ్మ రాజు. తన స్నేహితుడు హరి తో కలిసి స్కిట్స్ చేసేవాడు. అలా జబర్దస్త్, అదిరింది వంటి కామెడీ షో లు చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు. అయితే తాజాగా యాదమ్మ రాజు నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక పెద్ద ఇష్యూ అయింది. నన్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ ఓ వీడియో పెట్టాడు.

    దాంతో యాదమ్మ రాజు ఎందుకు అరెస్ట్ అయ్యాడనే సందిగ్ధత అందరిలో మొదలైంది. బయో లో ఉన్న లింక్ క్లిక్ చేయగా అసలు మ్యాటర్ ఏమిటో తెలిసింది. కాగా ఇటీవల యాదమ్మ రాజు ఓ వెబ్ సిరీస్ లో నటించాడు. అతను నటించిన ‘ హూ ఈజ్ మై డాడీ ‘ వెబ్ సిరీస్ ప్రమోట్ చేసే క్రమంలో ఇలాంటి డ్రామాలు ఆడాడు. పోలీసులు అరెస్టు చేశారంటూ వేషాలు వేశాడు. ఇందులో యాదమ్మ రాజు తన తండ్రి ఎవరో తెలుసుకోవడానికి ఊళ్లన్నీ తిరిగి వెతుకుతూ కనిపించాడు.

    అతని స్నేహితుడితో కలిసి తన డాడీ అని ఎవరిపై అనుమానం వచ్చిందో .. వాళ్ళందరి వెంట్రుకలు డీఎన్ఏ టెస్ట్ కోసం సేకరిస్తున్నారు యాదమ్మ రాజు. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగానే ఉంది. పైగా యాదమ్మ రాజు యాక్టింగ్, టేకింగ్ బాగుంది. టైటిల్ కి తగ్గట్టుగానే చాలా నాచురల్ గా అనిపిస్తుంది. కానీ ట్రైలర్ స్టార్టింగ్ లో ఎండింగ్ లో వచ్చే బూతులు వినడానికి మాత్రం అసభ్యంగా ఉన్నాయి.

    మొత్తంగా యాదమ్మ రాజు అరెస్ట్ కథ ఇదన్నమాట. సినిమా ప్రమోట్ చేయడానికి ఇలా అరెస్టు డ్రామా ఆడాడు. ఇక ట్రైలర్ చూసిన నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మరి కొందరు ఇదేం చిల్లర ప్రమోషన్స్ రా బాబు అని తిడుతున్నారు. ప్రస్తుతం యాదమ్మ రాజు ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో చేస్తున్నాడు. ఇప్పుడు ‘ హూ ఈజ్ మై డాడీ’ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.