https://oktelugu.com/

Hyper Aadi: పవన్ కళ్యాణ్ బాధ లో ఉంటే మాత్రం చూడలేను అంటున్న హైపర్ ఆది.. అసలు విషయం ఏమిటంటే..?

పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న హీరో కి ఎవరైనా సరే ఫ్యాన్ గా మారడమే కాదు. వీలైతే భక్తుడిలా కూడా మారిపోతూ ఉంటారు...పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని, అలాగే జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేలా కృషి చేయాలని యూత్ అందరిని మేల్కొలిపే ప్రయత్నం చేశాడు ఆది.

Written By:
  • Gopi
  • , Updated On : July 24, 2024 / 07:52 AM IST

    Hyper Aadi

    Follow us on

    Hyper Aadi: బుల్లితెర నటుడిగా కెరియర్ ను స్టార్ట్ చేసిన హైపర్ ఆది ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఆయన పలు రకాల సినిమాల్లో నటించడమే కాకుండా ప్రేక్షకులందరిలో మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలో హైపర్ ఆది కామెడీకి జనం నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇక దాంతో దర్శక నిర్మాతలు ఆయనకి ఎక్కువ అవకాశాలను ఇస్తు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆదికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం… పవన్ కళ్యాణ్ కోసం జనసేన పార్టీ తరఫున ఎలక్షన్ టైమ్ లో క్యాంపెనింగ్ చేసిన విషయం మనకు తెలిసిందే… పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని, అలాగే జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేలా కృషి చేయాలని యూత్ అందరిని మేల్కొలిపే ప్రయత్నం చేశాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన కృషికి ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచింది.

    ఇక రెండు ఎంపీ స్థానాలను కూడా గెలుచుకొని ప్రస్తుతం ఎన్డీయే కూటమితో కలిసి గవర్నమెంట్ ను ఏర్పాటు చేయడంలో జనసేన పార్టీ కీలక పాత్ర వహించింది. అలాగే సెంట్రల్ లో మోడీ ప్రధాన మంత్రి అవ్వడం లో కూడా పవన్ కళ్యాణ్ కీలకపాత్ర వహించాడనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి హైపర్ ఆదికి జనసేన పార్టీ తరఫున నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారు అంటూ చాలా రకాల వార్తలైతే వస్తున్నాయి…

    ఇక ‘శివం భజే’ అనే సినిమాలో నటిస్తున్న హైపర్ ఆది ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఇక అందులో భాగంగానే ఆయన ఆ సినిమా గురించి మాట్లాడుతూనే మధ్యలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన నవ్వుతూ ఉంటే దూరం నుంచి చూస్తా, అదే ఆయన బాధలో ఉన్నాడంటే దగ్గరికి వెళ్లి చూసుకుంటానని చెప్పాడు. అంతే తప్ప తనకు పదవి కావాలని ఉద్దేశ్యం లేదని పవన్ కళ్యాణ్ గారి కోసమే ఆ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నానని తన మీద వస్తున్న వార్తలు నిజం కాదని అవన్నీ పుకార్లని మొత్తానికైతే ఆ విషయాల మీద స్పందించాడు. ఇక దీంతో ఎమ్ ఎల్ సి పదవి పోటీలో హైపర్ ఆది లేడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే తనను తాను మరొకసారి పవన్ కళ్యాణ్ కి నిజమైన ఫ్యాన్ గా ప్రూవ్ చేసుకున్నాడు…ప్రస్తుతం ఆది ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూనే మంచి సక్సెస్ లను అందుకున్నాడు.

    ఇక అవకాశం దొరికిన ప్రతిసారి బుల్లితెర మీద కూడా అలరిస్తూ ప్రేక్షకులందరికీ ఆకట్టుకుంటున్నాడు… ఇదే ఊపులో కనక ఆయన ముందుకు దూసుకెళ్తే ఆడి చాలా తక్కువ రోజుల్లోనే ఇండస్ట్రీ లో టాప్ కమెడియన్ గా ఎరుగుతాడు అని చెప్పడం లో.ఎలాంటి సందేహం లేదు… ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్, మహేష్ బాబు ల సినిమాల్లో చాలా కీలకపాత్రల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఆది ఇండస్ట్రీకి వచ్చిన కొత్త లో చాలా కష్టపడ్డాడు. కాబట్టి ఇప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి…