https://oktelugu.com/

Allu Arjun – Hyper Adi :  అల్లు అర్జున్ ట్రోల్స్ మీద స్పందించిన హైపర్ ఆది.. ఏమన్నారంటే

జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ హైపర్ ఆది బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. తన మార్క్ పంచ్‍లతో దుమ్మురేపాడు ఆది.జబర్దస్త్ అంటే ఆది అన్నట్టుగా మారాడు. ఎంతో మంది కమేడియన్ లలో తాను కూడా ఒకడికి కలిసి పోయి టాప్ కమెడియన్ లలో నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 23, 2024 / 09:36 PM IST
    Follow us on

    Allu Arjun – Hyper Adi :  జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య ఏపీ ఎన్నికలు దూరం పెంచాయి అంటున్నారు విశ్లేషకులు. ఎన్నికలకు ముందు వైసీపీకి చెందిన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లారు బన్నీ. దీంతో ఈ విషయం తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని, జనసేనానిని అభిమానించే ప్రజలు అల్లు అర్జున్ మీద మండిపడ్డారు. ఇప్పటికీ కూడా అభిమానుల ట్రోల్స్ ఆగడం లేదు. అల్లు అర్జున్ మీద పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ కామెంట్లపై హైపర్ ఆది స్పందించారు.

    జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ హైపర్ ఆది బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. తన మార్క్ పంచ్‍లతో దుమ్మురేపాడు ఆది.జబర్దస్త్ అంటే ఆది అన్నట్టుగా మారాడు. ఎంతో మంది కమేడియన్ లలో తాను కూడా ఒకడికి కలిసి పోయి టాప్ కమెడియన్ లలో నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. వ్యంగ్యంతో కూడా ప్రేక్షకులను చాలా నవ్వించారు. ఈయన కామెడీ షో ద్వారా మాత్రమే కాదు ఇటీవల కాలంలో చాలా సినిమాల్లోనూ నటిస్తున్నారు ఆది. సినిమాలు, షోల గురించి పక్కన పెడితే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍కు హైపర్ ఆది వీరాభిమాని.

    అశ్విన్ బాబు హీరోగా నటించిన ‘శివం భజే’ అనే సినిమాలో హైపర్ ఆది నటించారు. ఇందులో ఓ చిన్న పాత్ర పోషించారు ఆది. ఆగస్టు 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆది పాల్గొన్నారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ ట్రోల్స్ గురించి ఆది వద్ద ప్రస్తావన వచ్చింది. అయితే దీని మీద స్పందించిన ఆది..అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నర్ అని.. పవన్ కళ్యాణ్ గారికి మెగా కుటుంబ సభ్యులకు గానీ అల్లు అర్జున్ మీద ఎలాంటి కోపం లేదన్నట్టు మాట్లాడారు.

    వారికి అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదని.. వాళ్ళంతా ఎప్పుడూ ఒక్కటే అన్నారు. నేషనల్ అవార్డు సాధించిన అల్లు అర్జున్ మీద ట్రోల్స్ ఆపేయాలని కోరుకున్నారు ఆది. మరి ఆది మాట్లాడిన ఈ కామెంట్ల మీద అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

    ఇదిలా ఉంటే రీసెంట్ గా’ఆయ్’ సినిమా ప్రెస్‌మీట్‌లోనూ అల్లు అర్జున్ ఆప్తుడు, మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు ‘బన్నీ’ వాస్ కు కూడా ఈ ట్రోల్స్ మీద ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే దీని మీద ఆయన స్పందిస్తూ..వారందరూ ఒక్కటేనని చెప్పడానికి ఒక్క ఈవెంట్ చాలని.. ఆ ఒక్క అకేషన్ కోసం ఎదురు చూస్తున్నాని బన్నీ వాస్ తెలిపారు.

    ఏపీ ఎన్నికల ముందు జనసేన కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు హైపర్ ఆది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో ఈయన ప్రచారం చేశారు. ప్రత్యర్థుల మీద మాటల తూటాలతో విరుచుకుపడ్డారు ఆది. మొత్తం మీద కూటమి గెలుపుతో జనసేన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక హైపర్ ఆదికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జనసేన పార్టీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.,

    మరి ఈ వార్తల్లో నిజం ఎంత? కూడా ఆదికి ప్రశ్న ఎదురు అయింది. దీనికి సమాధానంగా అటువంటిది ఏమీ లేదని..తాను కళ్యాణ్ కోసం మాత్రమే వర్క్ చేశాను అన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఆదికి చాలా ఇష్టం అన్నారు. ఆయన ఆనందంలో ఉంటే దూరం నుంచి చూసి ఇష్ట పడతాను అన్నారు. ఆయన బాధలో ఉంటే దగ్గరకు వెళ్లి చూసుకోవాలి అని ఉంటుందట. ఇక ఆది చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి.